Saturday, July 27, 2024

కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్లు చేసే మోసాలు కలెక్టర్ కు పట్టవా..?

తప్పక చదవండి
  • కంప్యూటర్ ఆపరేటర్ల అవినీతిలో కలెక్టర్ పాత్ర ఉందా..?
  • నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇంత దారుణానికి వడికట్టిన ధరణి ఆపరేటర్లపై కలెక్టర్ కి ఎందుకంత ప్రేమ
  • రైతుల పాలిట యమపాశంగా మారిన ధరణి ఆపరేటర్ల దరిద్రం వదిలించేది ఎన్నడు.
  • తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు..
  • ధరణిలో ఏ ఫైలు కదలాలన్నా ఆయన చేతిని తడపాల్సిందే..
  • టీఎం–33 వల్ల ధరణి ఆపరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న వేళ..
  • ధరణిలో జరిగే దారుణాలు అంత తానై నడిపిస్తున్న డిస్టిక్ కోఆర్డినేటర్ ధరణి శ్రీనివాస్ రెడ్డి..
  • కలెక్టర్ కార్యాలయంలోనే ఇంత దారుణానికి ఒడి కట్టిన అధికారులు..
  • గ్రామ పెద్దలను ఆశ్రయించిన బాధితులు

దేవరకొండ : నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ వ్యవస్థలో కొత్త పుంతలు తొక్కుతున్న అవినీతిమయం. వాటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత జిల్లా అధికారులు. ధరణి పేరు చెప్తేనే హడలెత్తిపోతున్న సామాన్య రైతులు.. లక్షలకు లక్షలు ఖర్చు అవుతున్న భూ సమస్యలు అలానే మిగిలిపోతున్నాయా.? ఏ అధికారి వద్దకు వెళ్లిన మీ భూ సమస్యలు పరిష్కారం కావడం లేదా.? జిల్లా యంత్రాంగం కలెక్టర్ కళ్ళు మూసుకొని రెవెన్యూ వ్యవస్థను నడిపిస్తున్న వైనం

ధరణి పేరుతో ఆపరేటర్లు భారీగా దండుకున్నారనే అనే చెప్పాలి. దానికి నిలువెత్తు సాక్ష్యం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. దీనికి ఉదాహరణ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో గత 5 రోజుల క్రితం ప్రచురించిన వార్తనే సాక్షమని ఎందరో సామాన్య రైతులు అనుకుంటున్నా కలెక్టర్ మాత్రం వాటిని తోసి పుచ్చడం ఏమాత్రం సమంజసం కాదని.. సామాన్య రైతులు దీనంగా కలెక్టర్ కార్యాలయం వైపు చూడడం జరుగుతుందని మేధావులు తీవ్రంగా మండిపడడం జరుగుతుంది. ధరణి పేరుతో జిల్లా కార్యాలయం నుండి దానిని ఆపరేటర్లు చేసే భారీ మోసాలకు తెరదించేది ఎన్నడన్నట్టు రైతులు చూస్తున్న ఎదురుచూపులకు కలెక్టర్ తెర దించేది ఎన్నడు. రైతుల పాలిట యమపాశంగా మారిన ధరణి ఆపరేటర్ల దరిద్రం వదిలించేది ఎన్నడు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భూ సమస్య ఉందని వచ్చినవారే పాపాత్ముడుగా మారారని.. మాయమాటలు చెప్పి ధరణి ఆపరేటర్లే వారిని భారీగా దండుకుంటున్నారని.. వారి సమస్యలను వారికే తెలియకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ భారీగా లాభదాయకంగా సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తుంది.

- Advertisement -

రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 అక్టోబర్‌ 20న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని, మూడుచింతపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పైసా లంచం చెల్లించకుండా పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ధరణి పోర్టల్‌ను రూపొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అదే పోర్టల్‌ పెద్ద సమస్యగా మారింది. ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే.. కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 50 శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్‌కి సంబంధించినవే వస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం బాధితులు నెలల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు ధరణిలో పొందుపర్చినా అవసరమైనవి లేకపోవడంతో భూమి కొనుగోళ్లు, అమ్మకాలు, మ్యూటేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరణి సమస్యలపై తొలుత తహసీల్దార్‌ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్‌కు పంపిస్తే పరిష్కారం లభిస్తోంది. అయితే తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు నివేదికలు పంపించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఇందుకు పోర్టల్‌లోని సాంకేతిక లోపాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సర్కారు కొన్ని మాడ్యూల్స్‌కు అవకాశం కల్పించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు.

పని చేయని కొత్త ఆప్షన్‌ :
ప్రభుత్వం ఇటీవల టీఎం–33 వల్ల ధరణి ఆపరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తుది.. (పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్‌) ఆప్షన్‌ ద్వారా చేర్పులు, మార్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణకు రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్‌ పరిశీలన చేసి కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. అయితే ఈ ఆప్షన్‌ సరిగా పనిచేయనందున ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో దరఖాస్తుదారులకు ఆర్ధిక ఇబ్బందులు తప్పడం లేదు. మీసేవాలో దరఖాస్తు చేసుకునేందుకు రూ.1500 వరకు ఖర్చు అవుతోందని, అది మీ సేవ వరకే పరిమితం.. మిగతాది చూస్తే అది ధరణి ఆపరేటర్ల బాగోతం అంతా కాదయ్యా అన్నట్టు భారీగా పైసలు ఇస్తేనే మీ పనులు పూర్తవుతాయని చెప్పడంతో ఓ రైతు వాపోయాడు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా పరిధిలో ధరణి ఆపరేటర్లకు డిస్టిక్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నల్లగొండ కలెక్టరేట్ నుండి ఈ భారీ మోసాలకు పాల్పడుతూ.. రియల్ వ్యాపారుల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఎన్నో ఆరోపణలు వస్తున్నా.. జిల్లా కలెక్టర్ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరుని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి. ఈసీ ధ్రువపత్రాల జారీకి అవకాశం కల్పించి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అప్‌డేట్‌ చేయించినా సిస్టమ్‌లో జనరేట్‌ కావడం లేదు. నిషేధిత జాబితా (పీవోబీ) మాడ్యుల్లోని భూముల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పిఓబి వీడియోలోని సమస్యలను రైతులు అధిగమించాలంటే ధరణి ఆపరేటర్లకు లక్షల్లో లేదా అంతకుమించి భారీ లంచాలు చెల్లించాల్సిందే.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ద్వారా పై అధికారులు ఒక పరిష్కార దిశగా అడుగులు వేయకముందుకే ధరణి ఆపరేటర్లు భూమి యజమానులతో బేర సారాలు కుదిరించుకొని వారి పనులను చక చక చేస్తూ దండుగా మెండుకుంటున్నారని కలెక్టరేట్ కార్యాలయం చెవులు కోరుకుంటున్న కలెక్టర్ కు మాత్రం వినిపించకుండా పోతోందా..?

గతంలో అమ్మిన వారి పేరుపైనే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తుండడంతో కొనుగోలుదార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పలు రకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్య చెప్పుకునే అవకాశం లేదా?
భూమి హక్కుల విషయంలో భారత న్యాయవ్యవస్థ అనేక సార్లు ప్రభుత్వాలను మందలించింది. ఐక్యరాజ్య సమితి 2018 డిసెంబర్17 న సర్వప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానంలో కూడా గ్రామంలో సేద్యం చేస్తున్న రైతుకు భూమి హక్కు ఉండాలని, వ్యవసాయ కూలికి పని హక్కు ఉండాలని తీర్మానం చేసింది. అయితే రాష్ట్రంలో మాత్రం ధరణి పోర్టల్ వల్ల భూమి హక్కు హరించుకుపోతోంది. ధరణి ఏర్పాటు చేసి నాలుగేండ్లు అయినా కూడా, దాదాపు 24 లక్షల ఎకరాల భూమి ధరణి సాంకేతిక రికార్డు వ్యవస్థలో నమోదు కాలేదు. ఎన్నో లక్షల వేల ఎకరాల భూములు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ధరణి ఆపరేటర్ల అవినీతిమయం రైతులకు కొరకరాని కొయ్యగా మారిందని ధరణి ఆపరేటర్ల దరిద్రాన్ని వదిలించేంతవరకు రైతులకు ఈ తిప్పలు తప్పవని.. తక్షణమే ధరణి ఆపరేటర్ల అవినీతి అరికట్టే విధంగా అడుగులు వేయాలని రైతులు, తోటి సమాజం కోరుకుంటుందని వివరించారు. కలెక్టర్ కార్యాలయంలోనే ఇంతటి దుస్సాహానికి పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు గ్రామ పెద్దలను ఆశ్రయించడం జరిగిందని, మండల ఎమ్మార్వో వివరించడం జరిగింది. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాలు బాధితులకు తిరిగి మళ్లీ రిజిస్టర్ చేసే విధంగా బాండ్ పేపర్ పై వ్రాసుకుని ఎమ్మార్వో వద్దకు వెళ్లిన అనంతరం ఎమ్మార్వో కలెక్టర్ కి ఫార్వర్డ్ చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ స్పందించి తక్షణమే ధరణి ఆపరేటర్లపై చర్యలు చేపట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలని సామాన్య రైతులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు