Saturday, July 27, 2024

తెలంగాణ సాంప్రదాయానికి అలాయ్-బాలాయ్..

తప్పక చదవండి
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో బెల్లి లలిత ప్రాంగణంలో అలాయ్-బలాయ్ కార్యక్రమం..
  • పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..
    హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్-బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూవస్తున్నారు. తాజగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బెల్లి లలిత ప్రాంగణంలో జరిగిన అలాయ్- బలాయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ.. తెలంగాణ ఉద్యమం రాజకీయలకు అతీతంగా సాగిందని తెలిపారు. ఎందరో ఉద్యమకారుల రక్తంతో తెలంగాణ ఏర్పడిందని వెల్లడించారు. “నేను గవర్నర్ వ్యవస్థలో ఉన్నాను కనుక రాజకీయాల గురించి మాట్లాడను. శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన తెలంగాణ కావాలన్నదే నా కోరిక. దేశంలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి. ఉద్యోగాలు లేక యువత నిరాశతో ఉనారు. పాలకులతోనే అభివృద్ధి సాధ్యం కాదు. స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..’ అని దత్తాత్రేయ ప్రసంగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు