Sunday, May 19, 2024

ట్విట్టర్‌లో అడ్వాన్స్ ఫీచర్స్ ప్రకటించిన మస్క్‌

తప్పక చదవండి

ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌మస్క్ ఏం చేసినా సంచలనమే. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విట్టర్’ (ఎక్స్‌)ను టేకోవర్ చేసిన మస్క్‌.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ అని మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్‌ లోగోను చేర్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్‌ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండానే యూజర్ల పరిచయాలతో కాల్స్‌ను కనెక్ట్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌ సహా వినియోగదారులందరికీ ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు