బెంగళూరు : సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్ ఆదిత్యఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భూమికి గుడ్‌బై చెప్పిన ఆదిత్యఎల్1 సూర్యుని దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ కక్ష్యను పెంచి ఆదిత్యుని దిశగా ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్`1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో ఇస్రో పోస్ట్ చేసింది. భూమికి సుమారు 15 లక్షల కిలోవిూటర్ల దూరంలో ఉన్న ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది ఆ పోస్ట్‌లో పేర్కొంది.