అమాయక ప్రజలను దోచుకోవడానికి
అవకాశం మాకియండి.. మాకియండి..
అంటూ ఈ రాజకీయ రక్కసులు
విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే..
ఓ చదువుకున్న అజ్ఞానులారా..
మెడడు నిండా జ్ఞానం ఉండి..
ముందుచూపు మరుస్తున్న
మేదావుల్లారా.. ఎందుకీ ఈ మౌనం?
ఇంకా అలాగే చూస్తూనే వుండండి..
రేపటి రోజు మనమేసుకునే గుడ్డల
మీద కూడా రాజకీయం చేస్తారు..
లే నిద్రలే.. ఉద్యమించి రాజ్యం తెచ్చుకున్న
నువ్వేనా ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నది..?
- ముస్త్యాల పరుశురాం…