- లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు..
- ఆరుగురు భారతీయ పర్యాటకుల మృత్యువాత..
- మాదేవ్ ప్రావిన్స్, భారత్ జిల్లాలో ఘటన..
- సమాచారం అందించిన భారత్ జిల్లా పోలీస్ అధికారి హోబింద్రా..
నేపాల్‌లోని మాధేష్ ప్రావిన్స్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ నుంచి భక్తులతో వెళ్తున్న బస్సు మాధేవ్ ప్రావిన్స్‌లోని బారా జిల్లాలో సిమారా సబ్ మెట్రోపాలిటన్ సిటీ వద్ద చురియమై ఆలయానికి దక్షిణంగా నదీతీరం వద్ద లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులతో పాటు ఓ నేపాల్ పౌరుడు మృతి చెందాడని, మరో 19 మంది గాయపడ్డారని నేపాల్ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో 26 మంది ప్రయాణికులతో పాటు ఓ నేపాలీ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సమాచారం అందించినట్లు పోలీస్ అధికారి ప్రదీప్ బహదూర్ ఛెత్రి తెలిపారు. ఘటనలో బస్సు డ్రైవర్ జిలావిూ ఖాన్‌తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బారా జిల్లా పోలీస్ కార్యాలయ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోబీంద్ర బోగటి తెలిపారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు మరికొందరికి గాయాలయ్యాయని, చికిత్స తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు మక్వాన్‌పూర్ జిల్లా హెతౌడాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. అయితే, నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు సాధారణమే. పేలవంగా ఉన్న రహదారి మౌలిక సదుపాయాలతో పాటు పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లో బస్సు నదిలో పడిపోవడంతో ఎనిమిది మంది మరణించగా.. 15 మంది వరకు గాయపడ్డారు.