లండన్ : ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ లండన్‌లో నిర్వ హించిన వేలంలో మెకలాన్ కంపెనీ తయారు చేసిన 97 ఏళ్ల నాటి సింగిల్ మాల్ట్ విస్కీ రూ.22 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 2019లో ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ.15 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ నెల 18న జరిగిన వేలంలో విస్కీ బాటిల్ ధర రూ.12 కోట్లు పలుకు తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా రూ. 22 కోట్లు పలికి అందరినీ ఆశ్చ ర్యానికి గురిచేసింది. మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి.. 60 ఏళ్లు నిలవ చేసింది. దానిని 1986లో 40 బాటిళ్లలో నింపింది. కానీ ఈ కంపెనీ వీటన్నింటిని అమ్మకానికి ఉంచలేదు. కొన్నింటిని మెకలాన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది.