Sunday, October 13, 2024
spot_img

తిరుమల ఘాట్‌రోడ్డులో బస్‌ బోల్తా..

తప్పక చదవండి

తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న 29 మంది భక్తులు ఉన్న విద్యుత్‌ బస్‌(Electric Bus) మొదటి ఘాట్‌రోడ్డులోని 30వ మలుపు వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎస్పీఎఫ్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ భక్తులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు