Wednesday, October 9, 2024
spot_img

అఖిలప్రియకు బెయిల్..

తప్పక చదవండి

కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 17న కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో స్థానిక టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ మధ్య విభేదాలు ఏర్పడి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో 17వ తేదీన పోలీసులు అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచగా వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కాగా ఆమె బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా బుధవారం కండిషన్‌ బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో నంద్యాల పీఎస్‌లో సంతకం చేయాలని అఖిలప్రియ దంపతులను కోర్టు ఆదేశించింది .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు