Friday, October 11, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..
అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..
కానీ ఈ సోకాల్డ్ రాజకీయ
నాయకులున్నారు చూడూ..
వీరికి ప్రకృతి అవసరం లేదు..
ధర్మాధర్మాలు అవసరంలేదు..
తమ అవసరాన్ని, తమ ప్రయోజనాన్ని
బేరీజువేసుకుని
ఊసరవెల్లికంటే వేగంగా, నైపుణ్యంగా
రంగులు మార్చగలరు..
ఎంతైనా వారికి వారే సాటి..

ఆ విషయాన్ని పసిగట్టకపోతే.. ఓ ప్రజానీకమా..
మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోయి..
మీ ముఖాలు వాడిపోయి.. దిక్కుతోచని పరిస్థితుల్లోకి
జారిపోయి.. చివరకు బోర్డులు లేని చౌరస్తాలో
చేష్టలిడిగి పిచ్చోడిలా మిగిలిపోతావు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు