Wednesday, May 1, 2024

జీ.హెచ్‌.ఎం.సీ ఖజానాకు గండికొడుతున్న సునీత..!

తప్పక చదవండి
  • అక్రమ నిర్మాణాలు ఈమె కనుసనల్లో సక్రమం అవుతున్నాయి : లక్షల్లో అవినీతి దందా..!
  • తీసుకునే లంచంలో ఎస్‌.టి.ఎఫ్‌.టీం.తో సహా జోనల్‌ కమిషనర్‌ దాకా పంచాల్సిందే..!
  • టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సునీత ఇచ్చిన ఓసీలు పర్మిషన్లు పై విచారణ జరపాలి..
  • జీ.హెచ్‌.ఎం.సీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌.. ఈ అవినీతి పై విచారణ జరపాలి..

కొత్త టీఎస్‌ బిపాస్‌ మున్సిపల్‌ చట్టం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం లోపాయికారి ఒప్పందాలు.. అక్రమ నిర్మాణం పూర్తి బాధ్యత ఎస్టిఎఫ్‌ స్పెషల్‌ టాస్క్ఫోర్స్‌ టీం దే అవుతుంది.. ఇంతవరకు చార్మినార్‌ జోన్‌ లో ఎస్టిఎఫ్‌ టీం పని చేసిన దాఖలాలే లేవు.. అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకునే బాధ్యతలు అనఫిషియల్‌గా టౌన్‌ ప్లానింగ్‌ కిందిస్థాయి అధికారులకు అప్పచెప్పడం దొంగకే తాళం చేయి ఇచ్చినట్లు అయిపోయింది.

ఈ ఒక్క నిర్మాణం వెనుక సుమారు 30 లక్షల అవినీతి..
ప్రభుత్వానికి జీ.హెచ్‌.ఎం.సీ ఖజానాకు చేరవలసిన బిల్డింగ్‌ నిర్మాణ పన్ను నిర్వహణ పన్ను 30 లక్షలు ఇంకా ఎక్కువే టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సునీత సొంత జేబుల్లోకి మరల్చుకుంది అనడంలో అతిశయోక్తి లేదు.. జీ.హెచ్‌.ఎం.సీ సర్కిల్‌ 6 పరిధికి సంబంధించి, దిల్సుఖ్నగర్‌ హైవే రహదారి కమర్షియల్‌ ఏరియా మూసారాంబాగ్‌ ‘‘కాఫీ డే’’ పక్కన భారీ కమర్షియల్‌ అక్రమ నిర్మాణం చేపడుతున్నారు వాటి వివరాలు:
టి ఎస్‌.బి.పాస్‌ ఫైల్‌ నెంబర్‌. 2/జ4/02398/2016, పర్మిట్‌ నంబర్‌:2/జ6/11949/2018,తేదీ 19 జూలై 2008, దిల్సుఖ్నగర్‌ ,గ్రామకంఠం సర్వేనెంబర్‌ 69డ5 ప్లాట్‌ నెంబర్‌ 2, 3 ఇంటి నెంబర్‌ 16-11-71/1 దిల్సుఖ్నగర్‌ 2 ముసరాంబాగ్‌, హైదరాబాద్‌, ఈ అడ్రస్‌ లో 586 గజాల స్థలంలో జీ.హెచ్‌.ఎం.సీ నుండి 2017 లో నాలుగు అంతస్తులకు గాను పర్మిషన్‌ తీసుకొని (ఇప్పుడు ఈ పర్మిషన్‌ చెల్లదు ఈ పర్మిషన్కు సమయం చెల్లిపోయింది కొత్త పర్మిషన్‌ తీసుకోవాలి) అచ్చంగా ఈ నిర్మాణదారుడు జీ.హెచ్‌.ఎం.సీ సంస్థకు లక్షల్లో పన్ను ఎగవేస్తూ .. కొన్ని నెలల క్రితం నిర్మాణం స్టార్ట్‌ చేసి ఉన్నారు.. ఈ నిర్మాణ దారుడు భారీ కమర్షియల్‌ నిర్మాణం నిర్మిస్తున్నాడు ఏలాంటి ఫైర్‌ అండ్‌ సేఫ్టీ అగ్నిమాపక రక్షణ చర్యలు తీసుకోకుండా ,లోతైన సెల్లార్డ్‌ తవ్వి అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నాడని, 200 మీటర్ల మెయిన్‌ రోడ్డు ను అనుకొని నిర్మాణం చేపడుతున్నాడు కాబట్టి 200 ఫీట్లకు గాను సెట్‌ బ్యాక్‌ ఎక్కువ వదలాలి అలా కాకుండా అవినీతిపరులైన అధికారులు 40 ఫీట్ల సర్వీస్‌ రోడ్డును పరిగణలోకి తీసుకొని తక్కువ సెట్‌ బాక్స్‌ తో ఎక్కువ లంచాలు తీసుకొని పర్మిషన్‌ ఇచ్చి ఉన్నారు.. సదరు అక్రమ నిర్మాణదారుడు జీ.హెచ్‌.ఎం.సీ నుంచి తీసుకున్న పర్మిషన్‌ గృహ నిర్మాణం కోసం కానీ కట్టింది వానిద్య నిర్మాణం , పర్మిషన్‌ ప్లాన్‌ ప్రకారం కట్టకుండా ఇంకా ఎక్కువ కక్కుర్తి పడి ఫుట్‌ పాత్‌ ను ఆక్రమించి లోతైన సెల్లార్‌ త్రవ్వి అక్రమాలకు పాల్పడుతన్నాడు అని పలువురు , నిర్మాణం మొదటి దశలో ఉన్నప్పుడు మొదట సెక్షన్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ గారికి, తదుపరి డిప్యూటీ కమిషనర్‌ గారికి, తదుపరి జోనల్‌ కమిషనర్‌ గారికి ఫిర్యాదులు చేసి ఉన్నారు.. వీరు ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం తో నిర్మాణం రంగులు వేసుకుని ఓపెనింగ్‌ స్థాయిలో ఉంది ఇక్కడ ఒక ఫ్లోర్‌ అద్దె లక్షల్లో ఉంటుంది నిర్మాణదారుడు సెల్లార్‌ తో కలిపి ఐదు ఫ్లోర్లు భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టి ఉన్నాడు..

- Advertisement -

జీ.హెచ్‌.ఎం.సీ ఖజానాకు గండి కొడుతున్న
టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సునీత..

అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సునీత పై చర్యలు తీసుకోవాలని ఆధారాలను పొందుపరిచి ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక రెండు కథనాలు తెలియపరచింది. ఈ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సునీత లీలలు అన్ని ఇన్ని కావు చార్మినార్‌ జోన్‌ పాతబస్తీ కాబట్టి కన్సిస్టడ్‌ ఏరియా ఇక్కడ ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టే అవసరం ఎక్కువగా ఉండదు. 14% ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జెస్‌ వారికి చూపి అందులో సగం ఇవ్వండి మీకు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా లక్షల్లో సేవ్‌ చేస్తున్నాను అంటూ కటింగ్‌ ఇచ్చి లక్షల్లో దోచుకోవడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య, ఏమిచ్చిన పర్మిషన్లపై ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లు ఓసీలపై పర్యవేక్షణ జరిపితే అన్ని అక్రమాలే అని తెలుస్తుంది.. ఇచ్చిన పర్మిషన్లకు ఓసీలకు లక్షల్లో లంచాలు తీసుకొని జీ.హెచ్‌.ఎం.సీ ఖజానాకు కోట్లల్లో గండి కొట్టింది అనడంలో అతిశయోక్తి లేదు..
గరీబోడు చిన్న గోడ కట్టినా చిన్న ఇల్లు కట్టుకున్నా , ఒక్క ఫ్లోర్‌ కట్టినా సెపరేట్గా సునీతకు పన్ను చెల్లించవలసిందే. నువ్వు జీ.హెచ్‌.ఎం.సీ కి పన్ను కడితే కట్టు పర్మిషన్‌ తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు కానీ నాకు మాత్రం ఫైన్‌ కట్టవలసిందే అంటున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సునీత ఈమె బాధితులు 100ల్లో ఉన్నారు. వారి గోడను వినిపిస్తూ ఆధారాలు సేకరించి ఆదాబ్‌ వార్తలు రాస్తూ ఉంది.. అసలు ఈ చార్మినార్‌ జోన్‌ మలక్పేట్‌ సర్కిల్‌ 6 ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా పనిచేస్తే వ్రాతపూర్వక ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోరు..! తీసుకుంటే ఇన్ని అవినీతి లీలలు ఉండవు కదా…. జీ.హెచ్‌.ఎం.సీ బాస్‌ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తక్షణమే స్పందించి ఈ అవినీతిపై విచారణ జరిపి ప్రభుత్వం ఖజానాకు రావలసిన ద్రవ్యాన్ని ఖజానాకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నపం…
జీ.హెచ్‌.ఎం.సీ పరిధి చార్మినార్‌ జోన్‌ లో జరుగుతున్న అవినీతి పై పూర్తి ఆధారాలతో… మరిన్ని కథనాలతో మీ ముందుకు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు