Friday, November 1, 2024
spot_img

ప్రత్యేక హోదాను మరచిన జగనన్న

తప్పక చదవండి
  • ఇందుకు చంద్రబాబు కూడా బాధ్యుడే
  • విమర్శలకు షర్మిల పదను

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్టాన్రికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్చిపోయారు. హోదా ప్రస్తావన తీసుకొస్తే జైల్లో పెట్టించారు. ఇక సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే రాష్టాన్రికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక స్వలాభం చూసుకున్నారే కానీ.. ఈ ఐదేళ్లలో హోదాపై ఉద్యమం చేసింది లేదు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్నారు. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణించా. మద్య నిషేధం అన్నారు.. ఇప్పుడేమో ఎక్కడ చూసినా మద్యం లభిస్తోందని పలువురు మహిళలు చెప్పింది విన్నాక బాధేసింది. మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నారు. మరి ఎక్కడికి పోయింది సీఎం జగన్‌ ఇచ్చిన హామీ పోలవరం ప్రాజెక్టును వదిలేశారు. అభివృద్ధిని పక్కనపెట్టిన వైకాపా, తెదేపా.. భాజపా జపం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు భాజపాకు బానిసలుగా మారాయి‘ అని విమర్శించారు. తాను జగన్‌ రెడ్డి అని పలికితే వైసీపీ వాళ్లకు నచ్చటం లేదని, అందుకే జగన్‌ అన్నా అని అనాల్సి వస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా పేరును జగన్‌ మరచిపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ ఇస్తే ఉద్యోగాలెప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. మద్యపాన నిషేదం పేరుతో తమను వైసీపీ నిలువునా ముంచేసిందని ప్రజలు ఆందోళన చేయడం కనిపించడంలేదా అని నిలదీశారు. మద్యపాన నిషేదం విధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగనన్న.. ప్రజలకు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నిలదీశారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేరని.. ఆ పార్టీని అంటే వైసీపీ ఎందుకంతగా భయపడుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు బీజేపీకి అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. బీజేపీకి తెలిసింది అంతా మత విధ్వంసమేనని విమర్శించారు. బీజేపీని విమర్శిస్తే వైసీపీ ఎందుకింతలా వణికిపోతుందని షర్మిల అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు