- డిసెంబర్ 9న ప్రమాణం ఖాయం
- కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఉంటుందని అన్నారు. హైదరాబాద్, బెంగుళూరు దేశానికి కవలపిల్లలు అని శివకుమార్ అన్నారు. కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుంచి నడుస్తోందని.. తెలంగాణలో మాత్రం పాలన ఫామ్ హౌజ్ నుంచి నడుస్తోందన్నారు. ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారన్నారు. వేరే పార్టీలు ఎమోషన్స్‌తో పాలిటిక్స్ చేస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రజల జీవితాలను దృష్ఠిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తాయన్నారు. తెలంగాణ విషయంలో కర్ణాటక హృదయంతో ఆలోచిస్తోందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లకి రిక్వెస్ట్… కర్ణాటక విషయాలు తెలుసు కోండి. అరగంటలో కర్ణాటక వచ్చి అక్కడ అమలవుతున్న పథకాల గురించి తెలుసుకోవచ్చున్నారు. కర్ణాటక ప్రజలకు 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. మా పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా పథకాలు ఉంటాయి. రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారు. కర్ణాటక రైతులకు మేం ఉచిత కరెంట్ ఇవ్వడం ప్రారంభించాం. తెలంగాణతో పోల్చితే.. కర్ణాటక పెద్ద రాష్ట్రం. కరెంట్ విషయంలో తెలంగాణ కంటే మేం మెరుగ్గా ఉన్నాం. కేసీఆర్ ఒక అబద్ధాల కోరు అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.