Friday, November 1, 2024
spot_img

భద్రత కల్పించండి

తప్పక చదవండి
  • బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత
  • అధికారులకు హైకోర్టు ఆదేశాలు
  • కొల్హాపూర్‌లో దూసుకుపోతున్న బర్రెలక్క
  • వినూత్న ప్రచారంతో పాటు.. మేనిఫెస్టో విడుదల
  • ప్రజల గొంతుకగా సమస్యలపై నిలదీస్తానని హామీ
  • పోటీ నుంచి విరమించుకునేలా ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపణ

కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్‌ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కావాలంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశించింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్‌ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఈసీకి, పోలీసులకు కోర్టు పలు సూచనలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని… థ్రెట్‌ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌ దే అని స్పష్టం చేసింది. పోలీసులు కేవలం కార్లు చెక్‌ చేస్తాం అంటే కుదరదని పేర్కొంది. బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్ట్‌ ఆదేశించింది. అయితే బర్రెలక్కకు 2 ప్లస్‌ 2 భద్రత కేటాయించాలని పిటిషనర్‌ కోరిన విషయం తెలిసిందే. కానీ హైకోర్టు బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని ఆదేశించింది.

వినూత్న ప్రచారంతో పాటు.. మేనిఫెస్టో విడుదల

- Advertisement -

బర్రెలక్క తన మేనిఫెస్టోతో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నందున సొంతంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో నిరుద్యోగుల అంశాలకు సంబంధించి కీలక హామలు ఇచ్చారు. శిరీష మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇలావున్నాయి. నిరుద్యోగం అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు అడుగుతాననని అన్నారు. డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని.. అందుకే దృష్టి సారిస్తోందంటూ అప్పట్లో ఫేమస్‌ అయిన శిరీష అలియాస్‌ బర్రెలక్క వీడియో తీసింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష తన వీడియోతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలా చేస్తోందని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడంతో శిరీషకు నిరుద్యోగుల నుంచి భారీ మద్దతు లభించింది. అప్పటి నుంచి శిరీషకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు ప్రజలు, యువత నుంచి మద్దతు కూడా లభిస్తోంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బారెలక్క), ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. మంగళవారం కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా తమ్ముడిపై దుండగులు దాడి చేశారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బర్రెలక్క ఏడుస్తూ చెప్పింది. ప్రజల మద్దతు పెరిగే కొద్దీ ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలాంటి దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. తమ్ముడిపై దాడి చేసి గాయపర్చడం దుర్మార్గమని వాపోయాడు. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులు, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తనకు, తన కుటుంబానికి ఆపదలో ఉన్నందున పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. దాడి ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని బర్రెలక్క తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గేది లేదన్నారు. నిరుద్యోగ యువత కోసం పోరాడతానని కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్‌ బర్రెలక్క అన్నారు. మరోవైపు బరేలక్కా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమెకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇదిలావుంటే కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్‌ శరీష సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడారు. తనను విత్‌డ్రా చేసుకోవాలంటూ పెద్ద పార్టీల వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకుంటే ఇంటి స్థలం.. ఇల్లు కట్టిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇలా చాలా మంది తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయింది. నామినేషన్‌ వేసేదాకా తనను ఎవరు పట్టించుకోలేదని.. ఇప్పుడు మాత్రం తనకు వస్తున్న ఆదరణను చూసి ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అన్యాయంగా మా భూమిని కొందరు ఆక్రమించుకున్నారని.. ఎన్నికలయ్యాక వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గర ఉండేవాళ్లకే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తాను ఓడిపోయాక దళిత బంధు ఇస్తారేమో చూడాలన్నారు. ‘నాకు ఇంత మద్దతు వస్తుందని పెద్ద పార్టీలు ఊహించలేదు. మా తమ్ముడిపై దాడి చేసింది అధికార పార్టీ వాళ్లే. ఇంత జరిగినా పోలీసులు మాత్రం మాకు ఎలాంటి భద్రత కల్పించట్లేదు. పెద్ద కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాం. అయినా భద్రత కల్పించట్లేదు. సోషల్‌ మీడియాలో చిన్న వీడియో పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. కొల్లాపూర్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మొదటి నుంచి తనది ప్రశ్నించే గొంతుక. అందుకే కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాను. తెలంగాణెళి కాకుండా అన్ని రాష్టాల్ర నుంచి మద్దతు ఇస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి నా కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంత సపోర్టు దొరకడం చాలా సంతోషంగా ఉందని బర్రెలక్క ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తనకు 2?2 భద్రత కల్పించాలంటూ బర్రెలక్క హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు