Wednesday, June 19, 2024

పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ లక్ష్యం..

తప్పక చదవండి
  • ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం..
  • తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది..
  • టీడీపీకి పట్టం కడితే పాలనను గాడిలో పెడతాం..
  • వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలో
    టీడీపీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్..

వికారాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఫంక్షన్ హాలులో ఎన్టీఆర్ 100 శతజయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగువారి ఆత్మగౌరవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు టిడిపి కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పరిగి పట్టణంలోని ప్రధాన రోడ్డుపై టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. దీంతో పరిగి ప్రధాన రోడ్లు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలతో పసుపు మయంగా మారాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ అహర్నిశలు శ్రమిస్తుందని, నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముందుచూపుతో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తోనే నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు నియామకాలు అనే నినాదంతో బారాస సర్కార్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదవాడు మరింత పేదవాడయ్యాడని, రైతులను తెలివిగా మోసం చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ అంశాన్ని పక్కనపెట్టి, బ్యాంకుల ద్వారా రైతుల నుండి వడ్డీలు వసూలు చేస్తూ, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలన్నీ ఎత్తివేసి కేవలం రైతు బంధు ఇస్తూ తెలివిగా మోసం చేస్తున్నాడు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేసేవాడని గుర్తు చేశారు. ఇక పోతే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయని, ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట తరహాలో పరిగి నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఒక్కసారి గమనించాలన్నారు. మరి ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. పరిగి ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

తెలుగు ప్రజల ఖ్యాతిని చాటి చెప్పింది టిడిపి పార్టీయే :
ఎన్టీఆర్ మొట్టమొదటిగా వృద్ధాప్య పింఛన్లు, మహిళలకు ఆస్తిలో సగభాగం, రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, వైద్య ఆరోగ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించారన్నారు. ఢిల్లీలో తెలుగు ప్రజలను మదరాశి అనేవారని.. ఎన్టీఆర్ వచ్చిన అనంతరం తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేసి తెలుగు ప్రజలకు ఢిల్లీలో మంచి గుర్తింపుని తెచ్చారని అన్నారు. అంతేగాక పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండలాల ఏర్పాటు ప్రజల వద్దకు పాలన ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టాడన్నారు.

- Advertisement -

ఒక్క అవకాశం ఇచ్చి చూడండి :
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు