Monday, September 9, 2024
spot_img

రండి బాబూ రండి..

తప్పక చదవండి
  • కార్మికులను ఆహ్వానిస్తున్న కెనడా దేశం..
  • విపరీతమైన కార్మిక కొరతతో అల్లాడుతున్న వైనం..
  • వర్క్ పర్మిట్ నిబంధనల సడలింపు..
  • వీసాల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వ నిర్ణయం..

కెనడా దేశం కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కెనడాలో కొనసాగుతున్న కార్మికుల కొరతను అధిగమించడానికి ఆ దేశం వర్క్ పర్మిట్ నిబంధనలను సడలించాలని తాజాగా నిర్ణయించింది. ఇతర దేశాలకు చెందిన వాళ్లు శాశ్వతంగా తమ దేశంలో కుటుంబ సభులతో కలిసి పని చేయడానికి అనుమతించే కొత్త నిబంధనలను ప్రకటించాలని కెనడియన్ ప్రభుత్వం నిర్ణయించింది.

కార్మికుల కొరతను తగ్గించేందుకు.. వీసాల జారీ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ జీవిత భాగస్వామి కోసం దరఖాస్తు పెట్టుకున్న వీసా ప్రక్రియను త్వరగా మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఎవరైనా కెనడాకు రావాలనుకునేవారి దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు