Tuesday, June 18, 2024

ఎం.జి.ఎం. వరంగల్ ను బ్రస్టు పట్టించిన సూపరిండేంట్ చంద్రశేఖర్..

తప్పక చదవండి
  • ఎం.జి.ఎం. పాలన గాలికి వదిలేసి పేదల ప్రాణాలతో చెలగాటం..
  • వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎం.జి.ఎం సూపరిండెంట్..
  • రోగి తరపున మాట్లాడిన గిరిజన నాయకులను పోలీసుల సమక్షం లోనే కులం పేరుతో
    దుసించినందున ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు.. తక్షణ అరెస్టుకు డిమాండ్..
  • ప్రజా సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త, ఎల్.హెచ్.పి.ఎస్.
    జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతోతు కిషన్ నాయక్.

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : రాజకీయ పైరవితో డెప్యూటేషన్ పై వరంగల్ మహాత్మ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎం. జి.ఎం) కు వచ్చిన సూపరిండేంట్ చంద్రశేఖర్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు. పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసి తన స్వలాభం కోసం పైరవీలు చేస్తుండటంతో.. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎం.జి.ఎం లో రోగులకు సరైన వైద్యం అందక నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో ఎం.జి.ఎం మొత్తంగా భ్రష్టు పట్టిపోయింది.. డాక్టర్ లు సక్రమంగా విధులు నిర్వహించకుండా తమ ప్రైవేట్ ఆసుపత్రులు నడుపు కుంటున్నారు. వీటిపై కనీస నియంత్రణ కూడా చేయకుండా ఎం.జి.ఎం సూపరిండేంట్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం నర్సింహుల పేట కు చెందిన నిహాన్, నెక్కొండకు చెందిన రాజు నాయక్, కె.ఎం.సి.లో పీజీ చదువుతున్న మెడికో ప్రీతి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్రచేసి ఎం.జి.ఎం.లో వైద్యం అందించకుండా ఆగమేఘాల మీద హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించి దొరికిపోయాడు. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయాడు. రెండు రోజుల క్రితం దుగ్గొండికి చెందిన రాములు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎం.జి.ఎం.కు వస్తే డాక్టర్ లు ఎవరూ అందుబాటులో లేక వైద్యం అండకు చనిపోయాడు.. డాక్టర్లు ఎందుకు అందుబాటులో ఉండటం లేదని, వైద్యం అందక ప్రాణాలు పోతుంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎం.జి.ఎం. సూపరిండేంట్ ను గిరిజన సంఘాలు అడిగితే కులం పేరుతో దూషించడం తన కుల అహంకారానికి నిదర్శనం. ఇదంతా కూడా మట్వాడ సి.ఐ. సమక్షంలో జరిగింది. గిరిజన సంఘాల పిర్యాదు మేరకు ఎం.జి.ఎం. సూపరిండేంట్ చంద్రశేఖర్ పై మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది.

కనుక సుప్రీం కోర్టు సర్క్యులర్ ప్రకారంగా, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన 24 గంటల్లో నిందితుడిని బేషరతుగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. కానీ పోలీసులు చట్టాన్ని అమలు చేస్తారా..? లేక మరోసారి ప్రజా ఆగ్రహాన్ని మూట గట్టుకుంటారో త్వరలోనే తేలిపోతుంది.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఇలాంటి అధికారిని ఎందుకు కాపాడుతున్నారో ప్రలకు చెప్పాలి. ప్రభుత్వానికి చిత్తుద్ధి ఉంటే వెంటనే కొత్త సూపరిండేంట్ ను నియమించి ఎం.జి.ఎం. మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు