Saturday, April 27, 2024

బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమ్‌ఇండియా..

తప్పక చదవండి
  • బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించలేకపోవడంతో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్‌కు పరాజయం తప్పలేదు.
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడింది.
  • రెండో వన్డేలో 5 వికెట్లతో విండీస్‌ గెలుపు
  • ప్రయోగాలకు పెద్దపీట వేసిన పోరులో టీమ్‌ఇండియాకు పరాజయం ఎదురైంది.
  • రోహిత్‌, కోహ్లీకి రెస్ట్‌ ఇచ్చి.. యువ ఆటగాళ్లను పరీక్షించాలనుకుంటే.. అది కాస్త బెడిసి కొట్టింది.
  • యంగ్‌ ఇండియా 181 పరుగులకే ఆలౌట్‌ కాగా.. విండీస్‌ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
    బ్రిడ్జ్‌టౌన్‌ : బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమ్‌ఇండియా.. బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించలేకపోవడంతో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్‌కు పరాజయం తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ఇండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్‌ (55) టాప్‌ స్కోరర్‌. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. షై హోప్‌ (63 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. కార్టీ (48 నాటౌట్‌), మయేర్స్‌ (36) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. హోప్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సిరీస్‌ 1-1తో సమం కాగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ మంగళవారం జరుగనుంది.
    కోహ్లీ, రోహిత్‌ లేకుంటే..
    వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న వెస్టిండీస్‌ సిరీస్‌లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నది. తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. రెండో మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌కు విశ్రాంతినిచ్చి చేతులు కాల్చుకుంది. ఐపీఎల్లో దంచికొట్టిన యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అదే జోరు కనబర్చడంలో విఫలమయ్యారు. దీంతో మేనేజ్‌మెంట్‌కు కొత్త సమస్యలు ఎదురవగా.. ఒక్క మ్యాచ్‌నో.. ఒక్క సిరీస్‌ ఫలితాన్నో పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోచ్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. విస్తృత ప్రయోజనాలను ఆకాంక్షించే ప్రయోగాలకు తెరతీశామని వెల్లడించాడు. కోచ్‌, కెప్టెన్‌ ఎన్ని చెప్పినా.. కోహ్లీ, రోహిత్‌ లేకుంటే భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒత్తితే అని ఈ మ్యాచ్‌తో స్పష్టమైంది. ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరిపోవాలనే చూశారు తప్ప.. బాధ్యత భుజానేసుకొని ఇన్నింగ్స్‌ను ముందుకు నడపాలని ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. మరి వరల్డ్‌కప్‌నకు ఎక్కువ సమయం లేని తరుణంలో మనవాళ్లు తదుపరి మ్యాచ్‌లోనైనా సమిష్టిగా సత్తాచాటాలని అశిద్దాం.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు