Friday, September 13, 2024
spot_img

ఇండియా తీరం చేరేనా!

తప్పక చదవండి

వచ్చే 2024 సార్వత్రిక లోక్‌ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్‌ కొట్టకుండా, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించడానికి దేశంలోని 26 పార్టీలు కలిసి ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంట్‌ ఇంక్లూజివ్‌ అలియన్స్‌)గా జతకట్టాయి. భారత్‌ జోడోయాత్రతో నూతన ఉత్సాహంతో ఉండడమే కాకుండా ఇటీవల కర్ణాటకలో జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయంతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్‌ విపక్షాలన్నిటిని ఏకతాటిపై తెచ్చి జతకట్టే ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతమైందని అనొ చ్చు. ఇండియా 26 జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల కలయిక ఏర్పడ్డ కూటమి మంచి రాజకీయ దురం దరుల నేతృత్వంలో ప్రస్తుతానికి బలంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ కూటమి లోక్‌ సభలో 143 సీట్లు కలిగి ఉంది. అలాగే రాజ్యసభలో 245 సీట్లకు గాను 98 సీట్లు కలిగి ఉంది, దేశం మొత్తంలోని 4036 అసెంబ్లీ స్థానాలకు గాను 1934 చోట్ల ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు దేశం లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 11చోట్ల అధికారంలో ఉంది. ఇక ప్రాంతాల వారీగా బలాలను బేరీజు వేసుకుంటే దక్షిణాదిన కేరళలో ముఖ్యమంత్రి పినరయ్‌ విజయ్‌ నేతృ త్వంలోని ఎల్‌ డి ఎఫ్‌ కూటమి అలాగే కాంగ్రెస్‌ నేతృత్వం లోని మరోకూటమి యు డి ఎఫ్‌ కూడా బలంగా ఉంది. తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం డీఎంకే 34 పార్లమెంటు స్థానాలను 24 లోక్‌ సభ ,10 మంది రాజ్యసభ సభ్యులను కలిగి ఉంది. వైకోకు చెందిన ఎండిఎంకే కూడా మద్దతుగా ఉంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్‌ పార్టీయే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల లో ఆంధ్రప్రదేశ్‌ లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తెలం గాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాసను బారాసగా మార్చి దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలని చూస్తున్నా ప్రస్తుతానికి దక్షిణాదిలో ఇండియాకు సానుకులంగానే ఉంది. ఇక ఉత్త రాది విషయానికి వస్తే ఇండియా కూటమికి పురుడు పోసి పేరు పెట్టిన మమత దీదీ తృణముల్‌ కాంగ్రెస్‌ బెంగాళ్‌ లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించి తన పట్టును కొనసాగిస్తుంది. అలాగే అక్కడ సుదీర్ఘ కాలం పాలించిన కమ్యూనిస్టు పార్టీ కూడా కూటమిలో భాగస్వామి గానే ఉండడం కలిసి వచ్చే అంశం. ఇక ఇండియా మొదటి సమావేశానికి వేదికైన బీహార్‌ విషయానికి వస్తే అప్రతిహా సంగా విజయ యాత్రను కొనసాగిస్తున్న ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌ జెడి పార్టీ మరియు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జెడిలు బలంగా ఉన్నాయి. మహారాష్ట్రలో శరత్‌ పవార్‌ ఎన్‌ సి పి పార్టీ, పార్టీ, ఉద్ధవ్‌ థాక్రేకు చెందిన శివసేన పార్టీలు జట్టు కట్టాయి. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన కేజ్రీవాల్‌ హయాంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢల్లీి పం జాబ్‌ రాష్ట్రాల్లో బలీయ శక్తిగా ఎదిగింది. అలాగే ఉత్తం ప్రదే శ్‌లో అఖిలేష్‌ ఎస్పీ పార్టీ జమ్ము కాశ్మీర్లో ఫారుక్‌ అబ్దుల్లా, ముక్తి మహబూబ్‌ పార్టీలు కూటమికి ఊపిరి అందిస్తున్నారు.
పొత్తుల పంచాయతీ తెగేనా!.. ఇండియా కూటమి మొత్తంగా చూస్తే బలంగా కనబడుతున్నప్పటికీ మెజార్టీ రాష్ట్రాలలో కూటమిలోని పార్టీలు గత ఎన్నికల్లో ప్రధాన పక్షాలుగా పోటీపడ్డాయి. బీహార్లో నితీష్‌ కుమార్‌ మరియు లాలు తనయుడు తేజస్వి యాదవ్‌ నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధంతో తలపడ్డారు. అలాగే పంజాబ్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ లు కుస్తీపడ్డాయి. ఇలా చాలా రాష్ట్రాల్లో హోరాహోరీగా తలపడ్డాయి. మరియు రాష్ట్రాలలో ఆయా పార్టీలు బలమైనవిగా ఉన్నాయి. ఇక్కడే అసలైన సమస్య ఉత్పన్నమవుతున్నది. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండవు అనేది నానుడి. కానీ క్షేత్రస్థాయిలో విరోధి పార్టీ కార్యకర్తలతో ఒక్కసారిగా మిత్రుత్వం మరియు సీట్ల పంపిణీ విషయంలో కూడా పేచీలు వచ్చే అవకాశం మెండుగా కనబడుతున్నది.
ప్రధాని అభ్యర్థి ఎవరు?..
ఇండియా కూటమికి వెన్నుముక ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ. కానీ ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే తాము అధ్యక్ష పదవికి మరియు ప్రధాని పీఠానికి రేసులో లేమని ముందుగానే అస్త్ర సన్యాసం చేశారు. ఇక మిగిలినవారిలో తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలమైన అభ్యర్థిగా కనబడుతున్న ప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని మిగిలిన పార్టీలు మరియు ప్రధాని రేసులో తాను కూడా ఉన్నాను అంటున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సమర్థిస్తారా? అలాగే మేధావి వర్గంలో మంచి పేరును సంపాదించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీ వాల్‌ వైపు మొగ్గు చూపుతారా లేక అన్ని పార్టీల సమన్వయంతో కాంగ్రెస్‌ అధ్యక్షులు దళిత సామాజిక వర్గంకు చెందిన శ్రీ మల్లికార్జున కార్గేనే ఎన్నుకుంటారా అనేది ముంబైలో జరిగే కూటమి మూడవ సమావేశం వరకు వేచి చూడాల్సిందే.
` బొల్లం సునీల్‌ కుమార్‌ 9059666011

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు