Thursday, May 9, 2024

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అత్యంత నేరం…

తప్పక చదవండి
  • దీని పైన అవగాహన పెరగాల్సిన అవసరముంది…
  • రక్షణ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేయాలి…
  • చట్ట పరమైన చర్యలను విసృతం చేయాలి..
  • యాంటీ ట్రాఫికింగ్‌ కార్యక్రమంలో నినదించిన న్యాయ నిర్వహణ అధికారులు…
  • యంగిస్తాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహాణ..
    హైదరాబాద్‌ : మనుషుల అక్ర మరవాణకు వ్యతిరేకంగా ఈ ఏడాది ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వ్యతి రేఖ దినోత్సవాన్ని’ నిర్వహించడానికి స్వచ్చంధ సేవా సంస్థలు, ప్రభుత్వ – చట్టపరమైన సంస్థలు, పౌర సమాజ సంస్థలు పర స్పరం భాగస్వాములయ్యాయి. అంతే కాకుండా ‘హ్యూమన్‌ ట్రాఫి కింగ్‌’ను నియంత్రించడం, బాధితులను గుర్తించడం, ట్రాఫికర్లపై ఉక్కుపాదం మోపడం తప్పనిసరని నినదించాయి. ఈ ఏడాది ‘రీచ్‌ ఎవ్రీ విక్టిమ్‌ ఆఫ్‌ ట్రాఫికింగ్‌, లీవ్‌ నో వన్‌ బిహిండ్‌’ అనే ప్రచార థీమ్‌గా ఎంపిక చేశారు. ఈ నినాదం 2030 సంవత్స రానికి కేంద్ర వాగ్దానాలైనటువంటి సుస్థిర అభి వృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీలు) నుంచి ప్రేరణగా తీనుకున్నారు. ఈ ప్రత్యేక దినోత్స వాన్ని పురస్కరించుకుని., నగరంలోని యంగిస్తాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో న్యాయ నిర్వాహాణ అధికారులు, ట్రాఫికింగ్‌ నుంచి బయటపడిన వ్యక్తులు, కళాకారులతో పాటు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (టీఎస్‌సీపీస), టీ-హాబ్‌ తదితరులతో కలిసి సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులతో భాగంగా హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, కార్మికుల కోసం అక్రమ రవాణా, కార్మికులను అక్రమంగా బంధి ంచడం, బలవంతపెట్టడం, దోపిడీ, హింసిం చడం, జీవితాన్ని దుర్భరమైన పరిస్థితులకు చేరువ చేయడం అత్యంత ఘోరమైన నేరమని తెలియజేశారు. ఈ సందర్భంగా హాజరైన అనీష్‌ అంథోని, చీఫ్‌ డెలివరీ అధికారి, టి. హబ్‌, శ్రీనివాస రావు, చైర్‌ పర్సన్‌, టి.ఎస్‌.సి.పీ.సి.ఆర్‌. పలు పోస్టర్‌ల ను విడుదల చేశారు. ‘‘మానవ అక్రమ రవాణా (హ్యూమన్‌ ట్రాఫికింగ్‌)ను ఎదుర్కోవ డానికి విద్య, అవగాహాన చాలా కీలకమై నది. ట్రాఫికర్ల వ్యూహా లు, జాగ్రత్త వహించాల్సిన హెచ్చరికలు తదితర సమాచారాన్ని సామాజికంగా వ్యక్తులకు, సంఘాలకు తెలియజేయాలి. సామాజికంగా విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారు అప్రమ త్తంగా ఉండటంతో పాటు ట్రాఫికింగ్‌పై అనుమా నాస్పద కార్య కలాపాలను అధికారులకు వెంటనే వెల్లడిరచేలా వారికి అవగా హానను కల్పిస్తామని’’ అని వారు తమ ఆలోచనల ను వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమైన ఈ కార్యక్ర మాన్ని నిర్వహించిన యంగిస్తాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాప కుడు అరుణ్‌ డేనియల్‌ ఎల్లమటి మాట్లాడుతూ, ‘‘ట్రాఫికింగ్‌ నెట్‌వర్క్‌ లను నిర్వీర్యం చేయడంలో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వడంలో సంబధింత శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేర స్తులను తరచుగా శిక్ష నుండి రక్షించే శిక్షార్హత విధానాలను నిలు వరించేలా ప్రభుత్వాలుప్రత్యేక శ్రద్దచూపాలనితెలిపారు. ఈ కార్య క్రమంలో భాగంగా, ట్రాఫికింగ్‌ కోరల నుంచి బయట పడిన బాధితులు తాము ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను, అనంతరం వారికి అవసరమైన పునరావాస అంశాల గురించి వివరించారు. సామాజికంగా వారు కోరుకునే పురోగతిని, సేవలను ప్రేక్ష కుల కు తెలిపారు. ఈకార్యక్రమంలో భాగంగాఅవగాహాన కల్పించడం కోసం వినూత్నంగా ప్రయత్నంగా ఆర్ట్‌ఎగ్జిబిషన్‌, క్యాప్రి సియో మ్యూజిక్‌ బ్యాండ్‌ ఆధ్వర్యంలోప్రత్యక్ష ప్రదర్శనను నిర్వహించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు