Tuesday, May 14, 2024

పర్యాటకులకు తప్పని తిప్పలు..

తప్పక చదవండి
  • వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌లో ట్రాఫిక్‌ జామ్‌..
  • కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫారెస్ట్‌ అధికారులు విఫలం..!
  • పార్కింగ్‌ సదుపాయం లేక రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిపివేత..
  • ఆ రోడ్డు గుండా ప్రయాణించే స్థానికులకు ఇబ్బందులు..
    వికారాబాద్‌ : జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడమే గాక, అనంతగిరి కొండలపై నుండి వర్షపు నీరు కిందికి ప్రవహించడంతో వర్షపు నీటి జలపాతాలు కనువిందు చేస్తున్నాయని సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావడం, దానికి తోడు వారాంతపు సెలవు ఆదివారం కావడంతో అనంతగిరి కొండలకు పర్యాటకుల తాకిడి పెరిగి రద్దీగా మారింది. అయితే అనంతగిరి పర్యాటక కేంద్రానికి సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నెలకొన్నాయి. ఓవైపు రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరిస్తుండగా, మరోవైపు వాహనాలు నిలపడానికి స్థలం లేక పర్యాటకులు రోడ్లకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్‌ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు వచ్చిన పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంలో జిల్లా అటవీశాఖ అధికారులు విఫలమయ్యారు అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దానికి తోడు వచ్చిన పర్యాటకుల నుండి పార్కింగ్‌ ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్న ఫారెస్ట్‌ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై పర్యాటకులు సైతం మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చిన పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించిన బాధ్యత జిల్లా అధికారులపై ఎంతైనా ఉందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు