Saturday, July 27, 2024

‘‘అల్లం’’ కల్లోలం..

తప్పక చదవండి
  • హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునర్నిర్మాణం దిశగా అల్లం ప్రభాకర్‌ రెడ్డి..
  • రేవంత్‌ రెడ్డితో భేటీ అయిన నాయకుడు అల్లం..
  • మాణిక్‌ రావ్‌ ఠాక్రేను కలిసే యోచనలో హుజూర్‌ నగర్‌, కోదాడ కాంగ్రెస్‌ నాయకులు
    హుజూర్‌ నగర్‌ :త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రేను హుజూర్‌ నగర్‌, కోదాడకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కలవనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలు స్థబ్దతగా ఉన్న నేపథ్యంలో ఉత్తమ్‌ పార్టీ మారతారనే ప్రచారం విస్తృతంగా కార్యకర్తల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా.. ఇప్పటికే అనేక మందిని పిలిచి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కొంతమంది తన వెంట వస్తారని భావించి వాళ్లకు ఎంపీ నిధుల నుండి తనకు నమ్మకంగా ఉన్న కార్యకర్తలకు కాంట్రాక్టులు ఇస్తున్నట్టు, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.. వెంటనే దీనికి విరుగుడుగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోదాడ హుజూర్నగర్‌ కు చెందిన ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారని తెలిసింది. మూడు రోజుల క్రితం కోదాడ నియోజకవర్గకు చెందిన చిలుకూరు మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పులిచింతల ప్రాజెక్టు వద్ద జరిగిన గెట్‌ టుగెదర్‌ కార్యక్రమంలో కూడా ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పద్మావతిలపై పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలిసింది.. ఒక పథకం ప్రకారం పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నట్లు నాయకులు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పార్టీ పదవుల్లో సైతం ఎవరికి ప్రాతినిధ్యం లేకుండా చేయడం, కొంతమంది అసమర్థులైన నాయకులనే పదవుల్లో ఉంచడం లాంటివి చూస్తే కాంగ్రెస్‌ పార్టీ పై రెండు నియోజకవర్గాల్లో కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు..
    చేరికలతో కళకళలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ లో చీలికలు తప్పేటట్లు లేవు..? ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పద్మావతి పార్టీ మారతారు అనే వార్త దీనికి ఆజ్యం పోసేలా ఉంది.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాలన ఒక వర్గం వారికే చేరువయ్యేలా ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజలలో ఉత్తమ్‌ కు ఆదరణ తగ్గిపోవడం,ఖమ్మంలో జరిగిన పొంగులేటి చేరిక సభకు హుజూర్నగర్‌, కోదాడ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయకపోవడం.. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని కోదాడ, హుజూర్‌ నగర్‌ నియోజకవర్గాల నాయకులు ముందస్తు చర్యలుగా అల్లం ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఠాక్రేను కలవనున్నారని సమాచారం… అల్లం ప్రభాకర్‌ రెడ్డి కిందిస్థాయి నాయకుడు కావడం, ప్రజలలో ఆదరణ కలిగి ఉండడం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం, ఇటీవల పోడు భూములపై కూడా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అల్లం ప్రభాకర్‌ రెడ్డికి రేవంత్‌ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం.. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారై ఉండడం.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనిహుజూర్నగర్‌ నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న అల్లం ప్రభాకర్‌ రెడ్డి దానికి తగినట్లుగా అడుగులు ముందుకు వేస్తున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి వారే అన్నట్లు ఉంటే, పార్టీకి నాయకులకు ఇబ్బంది అనే విషయంతో అలర్ట్‌ అయిన హుజూర్నగర్‌, కోదాడ నియోజక వర్గాలకు చెందిన నాయకులు ఠాక్రేను కలిసి ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి వివరించనున్నట్లు సమాచారం..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు