Friday, May 17, 2024

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డీజీ గా కమలాసన్ రెడ్డి ఐపీఎస్..

తప్పక చదవండి
  • సిన్సియర్ అధికారిగా పేరు పొందిన అధికారి..
  • ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో చేస్తారు..
  • పోలీస్ డిపార్ట్మెంట్ గర్వంగా చెప్పుకునే పేరు ఆయనది..
  • ఇక డ్రగ్స్ మాఫియా భరతం పడతాడని నమ్మకంతో ప్రజలు..

ఆయన సిన్సియారిటీకి సెల్యూట్ చేయాల్సిందే.. ఒక ఐపీఎస్ అధికారిగా ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో పనిచేస్తారు.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా డ్యూటీలో నిమగ్నమైపోవడం ఆయనకు జన్మతహా వచ్చిన మంచి అలవాటు.. నేరం చేయాలనుకునే వారు ఆయన డ్యూటీలో ఉన్నాడంటే జంకుతారు.. ఆయనే ఐపీఎస్ అధికారి కమలాసన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు తెలియని వారుండరు.. ఇక డిపార్ట్మెంట్ లో ఆయన పేరు వినగానే తోటి అధికారులు, క్రింది స్థాయి అధికారులు కూడా గర్వంతో ఉప్పొంగిపోతారు.. ద్యూటీని దైవముగా భావిస్తారు కమలాసన్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో, హైదరాబాద్ నగరంలో కూడా గురుతర బాధ్యతలు నిర్వహించిన ఆయన తన వృత్తికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు..

ప్రస్తుతం ఆయనను తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.. ఉన్నతాధికారులనుండి ఆయనకు ఆర్డర్లు కూడా వచ్చాయి.. ఈ సందర్భంగా స్వయంగా కేసీఆర్, కమలాసన్ రెడ్డి ని పిలిపించుకుని అభినందనలు తెలియజేశారు..

- Advertisement -

కాగా రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా వేళ్ళూనుకుపోయి.. ఇటు యువతను అటు అన్నివర్గాల వారిని, చిన్నాభిన్నం చేస్తూ.. జీవితాలను నాశనం చేస్తూ, నేర ప్రవృత్తిని పెంచుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు కమలాసన్ రెడ్డి రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించడంతో డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఇక పిల్లల తల్లిదండ్రుల్లో, సామాజిక వేత్తల్లో అంతలేని ఆనందం, ధైర్యం చోటు చేసుకుంది.. డ్రగ్స్ మహమ్మారిని కమలాసన్ రెడ్డి సమూలంగా నాశనం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఆదాబ్ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు