Saturday, May 18, 2024

2024 లో తెలంగాణ లో అధికార పాగా ఎవరిది?

తప్పక చదవండి

ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించింది, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా లో ఏ పార్టీ పాగా వేస్తుంది, అనేది పెద్ద చర్చగా మారింది, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇప్పటికే ముందు ముందు ప్రచారాలు చేస్తున్నారు, ఏ పార్టీ బలం ఎంతో చూడాలి!

భారాసా కే ప్రజలు మొగ్గు ఉందా!

- Advertisement -

ప్రస్తుతం అధికారం లో ఉన్న భరసా పార్టీ గత పదేండ్ల నుండి అధికారం లో ఉంది, అత్యధికంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీ,ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన పార్టీ గ చెప్పుకోవచ్చు, బారాస గత పది ఏళ్లలో వివిధ అభివృద్ధి పథకాలు చేస్తూ రాష్ట్రం ని అభివృధి వైపు నడిపిస్తుంది, వివిధ రకాల పథకాలు దేశంలో లేని విధంగా రూప కల్పన చేసిన ఘనత భారస కే దక్కుతుంది, అందులో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, శాధి ముబారక్, రైతు బంధు, రైతు భీమా, కంటి వెలుగు, వృద్యాప్య పెన్షన వంటి బహులమైన పథకాలతో గత పది రోజులుగా దశాబ్ది వేడుకలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది, రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండటం లో పెద్ద మార్పులు చేయకపోయినా, ప్రజల్లో మాత్రం భారసా కి మంచి రోజులు ఉన్నాయి అని చెప్పవచ్చు, అటు వామ పక్ష నాయకులతో పొత్తు ఉంటుందని ముందే వామ పక్ష నాయకులు డిక్లేర్ చేయడం జరిగింది. భరాసా కి ఏం చేయక పోయిన వాళ్ళు ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి పథకాలు,కొంత మేర సహకరిస్తుంది, అని చెప్పుకోవచ్చు.

కాంగ్రెస్ పార్టీకి కష్టమే!

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న పార్టీ కాంగ్రెస్, వ్యవహరించింది,అయితే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి పెద్దగా బలమైన నాయకులు కోల్పోతుంది అనడం లో సందేహం లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి జగ్గారెడ్డి హనుమంతరావు వంటి సీనియర్లే కనబడుతున్నారు కానీ కొత్త వాళ్లకు అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీలో తెలుస్తుంది, గతంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కూడా వెళ్లి బిజెపిలో చేరడం జరిగింది, రాష్ట్రంలో భరోసా పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు వీళ్ళు ఏం చేయాలో చెప్పడం లేదు, యువ నాయకత్వానికి అవకాశాలు లేవు అని తెలుస్తుంది, ప్రజలు గత అరవయ్యే ఏళ్లు కాంగ్రెస్స్ తో సావాసం చేసి అలసిపోయారు,అని తెలుస్తుంది, ఎది ఏమైనా కొన్ని సీట్లు వస్తాయి ఏమో గానీ అధికారం మాత్రం రాదు అనడం లో ఎలాంటి అనుమానం లేదు.

బీజేపీకి తెలంగాణ లో అవకాశం కష్టమే!

దేశంలో అధికారం లో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణా లో ఎలాంటి వ్యాహం పన్నుతోందో అనేది ప్రశ్న? వీళ్ళు దేశంలో కి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్న దేశాన్ని ఇంకా వెనక్కి నెట్టారు, తొమ్మిదేళ్లు పాలన లో ఎన్నో సమస్యలు తెచ్చి పెట్టిన ఘనత బీజేపీ కి మాత్రమే దక్కుతుంది, దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేస్తూ, నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ, సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ లో అవకాశం రాదు అనడం లో సందేహం లేదు, రైతులను దెబ్బ తీయాలనే ఉద్దేశం తో నల్ల చట్టాలు తెచ్చి ఎంతో ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం! ప్రతి పౌరునికి తన ఖాతా లో డబ్బులు వేస్తాను, నల్ల డబ్బు బయటకి తిస్థాను అందువల్ల నొట్ల రద్దు చేసి ఎన్నో ఇబ్బందులు ప్రజలు పడ్డారు, అటు కోవిడ్ లో కూడా ముందస్తు చర్యలు లేకుండా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు,ఇవన్నీ ప్రజలు గమనించి అధికారం ఇవ్వడం అనేది పెద్ద ప్రశ్నే! తెలంగాణ లో బీజేపీ కి స్థానం లేదు అని చెప్పుకోవచ్చు.
ఎది ఏమైనా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ,అటు వైయస్ అర్ టిపి, బీఎస్పీ లాంటి పార్టీ లు ఉన్న కూడా, ప్రజలు ఎక్కువ మొత్తం లో భరాసా కి మొగ్గు తుపుతున్నరు,అని తెలుస్తుంది, ఎందుకంటే గత పదేండ్ల పాలన లో చేసిన పనులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి, అనడం లో ఎలాంటి అనుమానం లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చేది భారస ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు.
అభిప్రాయం వ్యక్తిగతం మాత్రమే…!

కిరణ్ ఫిషర్ అడ్వకేట్
సెల్: 7989381219
తెలంగాణ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు