Thursday, May 2, 2024

రూ.5000లకే ఐఫోన్-14.

తప్పక చదవండి
  • ఢిల్లీలో ఘరానా మోసం..
  • కస్టడీలో ఇద్దరు మోసగాళ్లు..

ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్స్‌లో హై ఎండ్ ఐ-ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని పోస్టులు వస్తున్నాయా.. వాటిని పట్టించుకోకుండా ఉండటంతోపాటు సదరు పోస్టులు పెడుతున్న వారితో సంప్రదింపులు జరుపకుండా ఉంటే మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలా తక్కువ ధరకే హై ఎండ్ ఐఫోన్లు అనే పోస్టులతో అమాయకులను బురిడీ కొట్టించి.. అడ్వాన్స్ ఫీజు వసూలు చేసి, అటుపై ముఖం చాటేసే వారే ఎక్కువ అని తేలింది. అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫేక్ డీల్స్ చేస్తూ అమాయకుల్ని మోసగిస్తున్న వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. బీబీఏ ఫైనలియర్ విద్యార్థితోపాటు ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఢిల్లీ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. వీరు అత్యంత విలువైన గాడ్జెట్లు తక్కువ ధరకే విక్రయిస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులతో ఆకర్షిస్తూ పలువురు అమాయకులను మోసగిస్తున్నారు. ఈ ఆన్ లైన్ మోసగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన అఖిలేశ్ గుప్తా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

సంఘటిత గ్రూపుగా ఉన్న మోసగాళ్లు మోసపూరిత హామీలతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఢిల్లీ డీసీపీ (ఔటర్ నార్త్) రవికుమార్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డ్ (ఐపీడీఆర్) పూర్తిగా అనలైజ్ చేశాక పానిపట్‌లో సదరు మోసగాళ్లను గుర్తించామని తెలిపారు.

- Advertisement -

ఈ సైబర్ నేరాల కోసం మూడు ఫోన్లు వాడుతున్న రాఘవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. తమ దర్యాప్తులో ఆర్యన్ అనే మరో వ్యక్తిని నలందాలోని దేవి సరాయిలో అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్ పై మోసపూరిత సిమ్ గ్రూప్ లో ఒక వ్యక్తి రాఘవ్ అని తమ దర్యాప్తులో తేలింది. వీరు విభిన్న మోసపూరిత పద్దతులతో కొందరిని క్లాష్ నిక్స్ లో కాల్ చేసి తక్కువ ధరకే హై ఎండ్ ఫోన్లు, గాడ్జెట్లు విక్రయిస్తామని నమ్మిస్తారు. అందులోభాగంగా రాఘవ్ ‘గాడ్జెట్.వరల్డ్’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీ క్రియేట్ చేసి, అందులో కస్టమర్ల పాజిటివ్ రివ్యూలు, అన్ బాక్సింగ్ ప్రొడక్టుల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు ఇండియన్ స్మార్ట్ డాట్ కాం పోర్టల్ నుంచి ఫేక్ ఫాలోయర్స్ ను కూడా జత చేసుకుని సామాన్యుల్ని నమ్మిస్తున్నాడు రాఘవ్ అని తేలింది.

హై ఎండ్ ఫోన్లు, ప్రత్యేకించి ఐ-ఫోన్లు తక్కువ ధరకు రూ.5000లకే అందుబాటులో ఉన్నాయన్న పోస్టులు, ఆ ఫోన్ లు విక్రయిస్తున్న వ్యక్తుల పోస్టులు ఈ ఇన్ స్టాగ్రామ్ పేజీలో కోకొల్లలుగా ఉన్నాయి. వీటిని చూసిన అమాయకులు ఆసక్తి చూపితే, వాట్సాప్ లో వివరాలు పంపాలని చెబుతారు. ఆర్యన్ అనే వ్యక్తి అమెజాన్‌లో ఆర్డర్ బుక్ చేసినట్లు స్క్రీన్ షాట్ పంపుతాడు. అటుపై బాధితుల నుంచి రూ.500 అడ్వాన్స్ తీసుకున్న తర్వాత .. సదరు గాడ్జెట్ డెలివరీ డేట్ నాటికి అసలు కథ మొదలవుతుంది. బాధితులకు ఆ ఫోన్ లేదా గాడ్జెట్ ‘అవుటాఫ్ డెలివరీ’ అనే ఫేక్ స్క్రీన్ షాట్లు పంపుతున్నారు. ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. బాధితులకు రిలీఫ్ కల్గించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు