Tuesday, May 7, 2024

కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్..

తప్పక చదవండి
  • రైతులకు రూ. 10 వేలు సాయం ఇవ్వలేదు..
  • పంటల భీమా పథకం అమలుచేయడం లేదు..
  • కేంద్ర వివిధ శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు..
  • 10 ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను కేంద్రం పంపించింది..
  • కేసీఆర్ కి, కేటీఆర్ కి చిత్తశుద్ధి లేదు : కిషన్ రెడ్డి..

కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా పథకం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ భీమా పథకం అమలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రైతులకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వరదల విషయం తెలియగానే కేంద్రమంత్రి అమిత్ షాతో మాట్లాడాను. ఆయన వెంటనే రెండు ఆర్మీ హెలికాప్టర్లను, 10 ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను పంపించారు. వివిధ శాఖల కేంద్రప్రభుత్వ అధికారులు రేపటి నుంచి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. 900 పైచిలుకు ఎస్.డీ.ఆర్.ఎఫ్. నిధులతో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించవచ్చు. ఎస్.డీ.ఆర్.ఎఫ్. కింద మృతులకు రూ. 4లక్షల రూపాయలు ఇవ్వొచ్చు. పట్టణ ప్రాంతాల్లో కాల్వలు కబ్జాలు కావడం, పూడిక తీత పనులు చేయకపోవడం వల్లే వరదలు ముంచెత్తాయి. వరంగల్ నగరంలో ప్రతీయేటా వరదలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి.” అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు