- భారీ వర్షంతో తడిచి ముద్దైన హైదరాబాద్ నగరం..
- తీవ్ర ఇబ్బందులు పడ్డ పాదచారులు, వాహనదారులు..
- రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించిన వైనం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది.. జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, అబిడ్స్, కోఠి, ఫిల్మ్‌నగర్, మోహదీపట్నం, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది.. ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, గోల్కొండలో వర్షం పడింది. ఖాజా గూడా షేక్ పేట్ మార్గంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వచ్చింది.. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..