- మణికొండ నెక్నంపూర్‌లో వెలుగు చూసిన ఘటన..
- నకిలీ యూ.ఎల్.సి.తో క్లియరెన్స్ ఇస్తున్న గండిపేట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
- హెచ్.ఎం.డీ.ఏ. పర్మిషన్ అంటూ చేతులు దులుపుకుంటున్న స్థానిక మున్సిపల్ అధికారులు
హైదరాబాద్ : మణికొండ మునిసిపాలిటీ, నెక్నంపూర్ సర్వే నెంబర్ 141/బి, 143/బి, 144/బి.. యూ.ఎల్.సి. లో అక్రమ నిర్మాణాలు అప్లికేషన్ నెంబర్ 04573/ ఎస్ కె పి/ ఆర్1/యూ6/ హెచ్.ఎం.డీ.ఏ. /05052021 అనుమతులతో.. సర్వే నెంబర్ 141/బి లో 3.ఎకరాలు 75 గుంటలు.. 143/బి లో 0 ` 33 గుంటలు.. 144/బి లో 0.06 గుంటలు.. మొత్తం 2057 గజాల స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నాడు ఓ బిల్డర్.. 144 సర్వే నెంబర్ శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కలిపి నిర్మాణం చేస్తున్నాడు సదరు బిల్డర్.. ఈ బిల్డరుతో మంచి స్నేహబంధం నడుపుతున్నాడు గండిపేట్ రెవెన్యూశాఖ ఇన్స్పెక్టర్.. హెచ్.ఎం.డీ.ఏ. ఆ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం కోసం మున్సిపల్ అధికారులకు ఫైల్ పంపించారు.. అధికారులు నో అబ్జెక్షన్ ఇవ్వడంతో ఇంకేముంది నిర్మాణం ఆగమేఘాలపై జరుపుతున్నారు. కాసులకి అమ్ముడు పోతున్న ఇలాంటి అవినీతి అదికారులు ఉన్నంత కాలం అక్రమ నిర్మాణాల జోరు సాగుతూనే ఉంటుంది.. ప్రభుత్వ స్థలాలు, నాలాలు మాయం చేస్తున్నా.. కాసులకి కక్కుర్తి పడుతున్న మున్సిపల్, రెవెన్యూశాఖ అధికారులు వారికి మద్దతు తెలుపుతూ.. మూడు పూవులు, అరు కాయలు అన్న చందంగా అధికారు లు జేబులు నిపుకుంటున్నారు.. ఇదే బిల్డర్ పంచవటి కాలనీ నాలాలలో అక్రమ నిర్మాణం చేశారు.. అంటే అతను అధికారులను ఏ విధంగా కవర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. మణికొండ మున్సిపల్ గా ఏర్పాటు అయ్యాక, ఇక్కడ గజం స్థలం లక్షలు పలుకుతోంది.. అధికారులు సహకరిస్తుండగా రియల్ ఎస్టేట్ మాయగాళ్లు తమ మాయాజాలంతో ప్రభుత్వ భూములు ఏవిధంగా మాయం చేయాలి.. అనే కుయుక్తులతో ముందుకు పోతున్నారు.. మున్సిపల్ అధికారులు, హెచ్.ఎం.డీ.ఏ., రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులను రాచ మర్యాదలతో చూసుకుంటే చాలు.. .బిల్డర్స్ కి పంట పండినట్టే అంటున్నారు స్థానిక ప్రజలు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కనుమరుగు చేసే ప్రమాదం ఉందని, ప్రకృతితో ఆటలు ఆడుతూ ఉత్తరాఖాండ్ లాగా ప్రాణం మీదకు కొని తెచ్చుకోవడమే అంటున్నారు స్థానికులు.. ఇకనైనా యూ.ఎల్.సి. లో అక్రమ నిర్మాణం చేస్తున్న వారిని అడ్డుకొని.. అధికారులు తమ నిజాయితీని నిరూపించుకోవాలి అని మున్సిపల్ ప్రజానీకం వేడుకుంటోంది..
తప్పక చదవండి
-Advertisement-