- షాకింగ్ కి గురిచేసిన విన్నూత్న ప్రదర్శన..
- ఒంటిపై నూలుపోగులేకుండా..
- అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ల చీడ వదిలించాలని నినాదాలు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో షాకింగ్ రీతిలో కొందరు నిరసనలు చేశారు.. ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్డెక్కి ప్రదర్శనలు చేశారు.. అసెంబ్లీ సమీపంలో గుంపులుగా వారు నగ్నంగా నిరసనలు చేపట్టారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్ల చీడ ఉన్నదని, దాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందినట్టుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.. ఇందుకు సంబంధించి చేతిలో ప్లకార్డులు పట్టుకుని వారు రోడ్లపై నగ్నంగా ప్రదర్శనలు చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. ఈ వీడియోలతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఛత్తీస్‌గడ్‌లో నకిలీ కుల సర్టిఫికేట్లకు వ్యతిరేకంగా నిరసనలు జరగడం ఇది తొలిసారి కాదు. కానీ, ఈ తరహాలో నగ్నంగా ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేయడం మాత్రం ఇది వరకు ఎప్పుడూ జరగలేదు. ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తమ డిమాండ్లను ఈ సందర్భంలోనే చట్టసభ్యుల దృష్టికి బలంగా తీసుకెళ్లగలమని వారు భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీ సమీపంలో వారు ప్రదర్శనలు చేసినట్లు తెలుస్తోంది..
తప్పక చదవండి
-Advertisement-