Sunday, May 12, 2024

పురుషుల బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్‌

తప్పక చదవండి
  • ఇండోనేషియా ఓపెన్‌లో ఆడుతూ తుపాను వేగంతో స్మాష్‌ కొట్టిన వైనం
  • మలేషియా ఆటగాడ పేరిట ఉన్న రికార్డు బద్దలు
    ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌`1000 టోర్నీలో డబుల్స్‌ విభాగంలో ఆడుతున్న సాయిరాజ్‌ కొట్టిన ఓ స్మాష్‌ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్‌ హిస్టరీలో ఇప్పటివరకు ఇంత బలంగా ఎవరూ స్మాష్‌ కొట్టలేదు
    న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగుతేజం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకి రెడ్డి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. పురుషుల బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ కొట్టనంత వేగంగా స్మాష్‌ కొట్టిన సాత్విక్‌ సాయిరాజ్‌ వరల్డ్‌ రికార్డు నమోదు చేశాడు. ఇండోనేషి యా ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నీలో డబుల్స్‌ విభాగంలో ఆడుతున్న సాయి రాజ్‌ కొట్టిన ఓ స్మాష్‌ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిం ది. బ్యాడ్మింటన్‌ హిస్టరీలో ఇప్పటి వరకు ఇంత బలంగా ఎవరూ స్మాష్‌ కొట్ట లేదు. గతంలో ఈ రికార్డు మలేషియాకు చెందిన టాన్‌ బూన్‌ హియాంగ్‌ పేరిట ఉంది. హియాంగ్‌ 2013 మేలో గంటకు 493 కిలోమీటర్ల వేగంతో స్మాష్‌ ను సంధించాడు. ఇప్పుడా రికార్డును సాత్విక్‌ సాయిరాజ్‌ బద్దలు కొట్టాడు. సాత్విక్‌ కొట్టిన షాట్‌ వేగం ఓ ఫార్ములా వన్‌ రేస్‌ కారు వేగం కంటే ఎక్కువ. మరోవైపు, మహిళల విభాగంలో మలేషియాకు చెందిన టాన్‌ పియర్లీ పేరిట వేగవంతమైన స్మాష్‌ రికార్డు నమోదైంది. పియర్లీ గంటకు 438 కి.మీ వేగంతో స్మాష్‌ను కొట్టింది.

.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు