హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పరీక్ష రెస్పాన్స్ షీట్లు వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. తదితర వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఈ నెల 8వ తేదీన టీపీబీవో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.