Tuesday, September 10, 2024
spot_img

రూ. పదివేలు ఆర్ధిక సాయం అందించిన బీ.ఆర్.ఎస్. నాయకులు..

తప్పక చదవండి
  • నాగపురి కిరణ్ కుమార్ సేవా తత్పరత..

జనగామ జిల్లా కేంద్రం, ధర్మకంచె ప్రాంత దళిత సామాజిక వర్గ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్.. నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన భార్య భర్తలైన బోట్ల యాకుబ్, బోట్ల ఎల్లమ్మ మూడు నెలల వ్యవదిలో అనారోగ్యంతో మరణించారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ బాధిత గృహానికి వెళ్లి తల్లి, తండ్రిని కోల్పోయిన కూతురు స్వాతిని, కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ దీనస్థితిని చూసి చలించిపోయిన కిరణ్ కుమార్ 10,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని కూతురు స్వాతికి అందజేశారు. భవిష్యత్తులో అమ్మాయికి అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు కందుకూరి ప్రభాకర్, వేముల లక్ష్మణ్ గౌడ్, తిప్పరాపు ప్రసాద్, ఆకుతోట మురళీకృష్ణ, తిప్పరాపు శ్రీను, కర్రే శ్రీను, ఉదయ్ కుమార్, శ్రీకాంత్, పశ్చిమడ్ల సాయి, గుండె రాజు, గుండె అజయ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు