Saturday, July 13, 2024

ఓటమి భయంతోనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనుఅధికార పార్టీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు..

తప్పక చదవండి
  • జనగామ పట్టణంలో సబ్ స్టేషన్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
    బుధవారం రోజు జనగామ పట్టణంలో హన్మకొండ రొడ్ లోని సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నదానికి నిరసనగా.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. అనంతరం సేవాదళ్ రాష్ట్ర ఆర్గనైజర్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్, యాదవ్ కిసాన్ కాంగ్రెస్ జనగామ పట్టణ అధ్యక్షులు మోటే శ్రీనివాస్, లీగల్ సెల్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలేటీ సిద్దిరాములు, జనగామ పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ రామగల్ల అరుణ విజయ్ కుమార్, జనగామ మండల సీనియర్ నాయకులు దాసరి శేఖర్ లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా తానా సభలో పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వవద్దని రేవంత్ రెడ్డి ఎక్కడ అనలేదని కావాలని బి.ఆర్.ఎస్ ప్రభుత్యం ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది అని .. ఒక ఎకరానికి నీరు పట్టాలంటే ఒక్క గంట కరెంటు చాలు, మూడు ఎకరాలకు నీరు పట్టాలంటే మూడు గంటల సమయం పడుతుంది, మొత్తానికి చిన్న సన్న కారు రైతులకు ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని అన్నాడు అని అన్నారు.. అదే విధంగా కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ కొరకే 24 గంటలు ఉచిత కరెంటు రైతుల పేరుతో వాడుతున్నాడని తెలిపాడు.. విద్యుత్ పై జరుగుతున్న అక్రమాలను బయట పెడుతుంటే ఓర్వలేకే, ఓటమి భయంతో రేవంత్ రెడ్డి పైన అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది.. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్… ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు బిఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని అన్నారు.. మూడు, నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి బుద్ది చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో వెంకిర్యల ఎంపీటీసీ కొమ్మరాజుల పరుశురాములు, పట్టురీ శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చేనోజు విజయ లక్ష్మి, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, ఆకుల లక్ష్మయ్య, బండారు శ్రీనివాస్, జాయ మల్లేష్, బిర్రు సత్యనారాయణ, పిక్క బీరప్ప, బోరెల్లి సిద్ధులు, యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, గందమల్ల కమలాకర్, మోటే మల్లేష్, నిడికొండ ముచ్చాలు, యండీ ఇస్మాయిల్, ఎదునురి యాదగిరి, సిద్దెంకి గ్రామ అధ్యక్షులు బాల మైసయ్య, పసరమట్ల గ్రామ అధ్యక్షులు దేవులపల్లి నారాయణ, కుర్రేముల రవి కుమార్, కర్రె ఉదయ్, కుకట్ల సుజాత, పిడుగు రమేష్, బైరగోని రఘుగౌడ్, కొమ్మూరి యువసేన జనగామ మండల అధ్యక్షులు బక్క ప్రవర్డన్, కొమ్మూరి యువసేన జనగామ మండల వైస్ ప్రెసిడెంట్ గాజుల రాజు, బాలమైన సంపత్, మోటే సాగర్, బండవరం నరేష్, కొంగరి శ్రావణ, బర్ల సూర్య కిరణ్, కసర్ల మధు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు