Tuesday, June 25, 2024

జూలై నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు..

తప్పక చదవండి

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. జూలై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవంలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

కాగా గురువారం ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలతో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో 16 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 71,615 మంది భక్తులు దర్శించుకోగా 30,219 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చిందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు