Thursday, May 16, 2024

శ్రీశైలంలో వైభవంగా సహస్ర ఘటాభిషేకం..

తప్పక చదవండి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఘటాభిషేక పూజలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పాతాళగంగ నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఘటాభిషేకం పూర్తయిన తర్వాత మహానివేదన, నీరాజన, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. సహస్ర ఘటాభిషేకం సందర్భంగా ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు నిలిపివేశారు. స్వామివారి దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 30న వేకువజామున మంగళవాయిద్యాలకు ముందుగా గర్భాలయంలోని జలాన్ని తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు