Saturday, July 27, 2024

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు….!

తప్పక చదవండి
  • గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం..
  • హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ..

హైదరాబాద్‌: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.. నేడు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు చాలా చోట్ల, వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు