న్యూఢిల్లీ : కొవిడ్19 వ్యాక్సిన్ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం వెల్లడిరచింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేల్చింది. దీనికి సంబంధిం చిన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. యువతలో ఆకస్మిక మర ణాలకు గల కారణాలను విశ్లేషించేందుకు అక్టోబరు 1, 2021 నుంచి మార్చి 31, 2023 మధ్య కాలం లో ఐసీఎంఆర్ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. దీని కోసం ఆకస్మికంగా మరణించిన 1845 ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 729 కేసులు, 2,916 కంట్రోల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని తెలిపింది. కనీసం ఒక డోసు వ్యా క్సిన్ తీసుకున్నా.. ఈ ముప్పు తగ్గుతుందని నివేదికలో పేర్కొంది. ఈ ఆకస్మిక మరణాలకు ధూమ పానం, తీవ్ర శ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, మత్తు పదార్థాల విని యోగం వంటి వాటితోపాటు, కొవిడ్ చికిత్స తర్వాత జీవనశైలిలో మార్పులు, ఆహారపు అల వాట్లు వంటివి కూడా కారణాల కావచ్చని తెలిపింది.