Wednesday, April 24, 2024

అహింసతో భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు బాపూజీ…

తప్పక చదవండి
  • గాంధీజీ బాటలో పయనించి మన లక్ష్యాన్ని చేరుకుందాం : నీలం మధు ముదిరాజ్..
  • చిట్కుల్ లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..
  • స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..

గాంధీ మార్గమే తన మార్గమని తెలుపుతూ.. ఆ బాటలోనే అందరూ నడవాలని స్ఫూర్తి దాయక ప్రసంగంతో ఆకట్టుకున్నారు ఆ యువ నాయకులు.. మహాత్మాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన తాను పయనించబోయే మార్గాన్ని తన అభిమానులకు తెలియజేశారు..

హైదరాబాద్ : అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.. మహాత్మ గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం అందించడం కోసం, అహింసా పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేసి, అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు. గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం భారతీయులకే కాదు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. అలాంటి మహోన్నత బాపూజీ మార్గం నుంచి నేటి యువత స్ఫూర్తి పొంది, ఆయన బాటలో పయనించాలని కోరారు. పటాన్ చెరు నియోజకవర్గంలో బహుజన రాజ్యం రావాలని కోరుతున్న మనమంతా బాపూజీ చూపిన మార్గంలో.. ఆయన అడుగుజాడలలో పయనించి, మన ఆకాంక్షలను సాకారం చేసుకుందామని తెలిపారు. శాంతియుత పద్ధతిలో పోరాటం కొనసాగిస్తే మన లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

- Advertisement -

ప్రతి ఒక్కరం మన లక్ష్య సాధన దిశగా పయనించడానికి ఐక్యమత్యంతో ముందుకు సాగి మన పోరాటాన్ని కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చిట్కుల్ గ్రామంలో పారిశుద్ధ్య పనులలో పాల్గొని, పరిసరాలను శుభ్రం చేశారు. మహాత్మా గాంధీ స్వచ్ఛ భారతవనిని సాధించడామే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములై తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటకాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో గాంధీజీ చూపిన బాటలో పయనిస్తూ.. చిట్కుల్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, కేంద్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో సైతం ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ.. స్వచ్ఛభారత్ మహా యజ్ఞంలో తమ వంతు పాత్రను సక్రమంగా నిర్వహిద్దామని విజ్ఞప్తి చేశారు..

ఈ కార్యక్రమంలో అమీన్పూర్ కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, ఈఓ కవిత, ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, వెంకటేశ్, భుజంగం, శ్రీను, మురళి, వెంకటేశ్, రాజ్ కుమార్, యాదగిరి, ఆంజనేయులు, మాజీ పీ.ఏ.సి.ఎస్. చైర్మన్ నారాయణ రెడ్డి, చాకలి వెంకటేష్, ఏఎన్ఎంలు, ఎన్.ఎం.ఆర్. యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు