Tuesday, May 28, 2024

పతనానికి పునాదులు..

తప్పక చదవండి
  • కేసీఆర్‌ అధికారానికి అదే చివరి రోజు
  • తెలంగాణలో కర్ణాటక వ్యూహం.. కలిసికట్టుగా ఎన్నికలకు నేతలు
  • కోమటిరెడ్డితో కలసి జూపల్లి, పొంగులేటితో చర్చ
  • కాంగ్రెస్‌లో చేరాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వానం
  • నేడు ఢల్లీిలో రాహుల్‌ను కలవనున్న రేవంత్‌
  • జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ
  • రాజకీయ పునరేకీకరన జరగాలి : రేవంత్‌ రెడ్డి
  • అధికారం ముఖ్యం కాదు : ఎంపీ కోమటిరెడ్డి

ఖమ్మం, పొంగులేటి ఫిక్సయ్యారు.. గత 5 నెలలుగా తన అభిమానుల కోరికున్నట్లుగానే కాంగ్రెస్‌ పార్టీలోకి అడుగి పెట్టేందుకు సిద్దమయ్యారు… తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పొంగులేటి ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించటంతో ఇన్నాళ్ళ ఊహగానాలకు ఇక పుల్‌ స్టాప్‌ పెట్టినట్లైంది… ఈ నెల 25న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ తో మర్యాదపూర్వక భేటీ కానున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి… అంతకు ముందే రేవంత్‌ రేపు రాహుల్‌తో సమావేశమయ్యి పొంగులేటి అండ్‌ టీం కు సంబందించిన విషయాలను వివరించనున్నారు.. అయితే ఖమ్మం జిల్లా శీనన్న అభిమానుల అందరి కోరిక ను శీనన్న నెరవేర్చటంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేఖాలు వ్యక్తమౌతున్నాయి.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఇతర సీనియర్‌ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి.. ఈ ఇద్దరి నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. ముందుగా జూపల్లి కృష్ణారావును కలిసిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం పార్టీలోకి రావాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్లిన నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ చేరిక అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌ను గద్దెదించేందుకు కలిసిరావాలని కోరినట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి ఇద్దరూ జులై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25నే దిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమై చర్చించి, 26న దిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన పార్టీలోకి చేరికను ప్రకటిస్తారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలోనూ ఖమ్మం బహిరంగ సభపై చర్చించినట్లు తెలుస్తోంది.బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లి తదితరులతో బీజేపీ నేతలు మొదట చర్చలు జరిపారు. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదనే అభిప్రాయం అనుచరుల నుంచి వ్యక్తం కావడం, కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడం తదితర కారణాలతో పొంగులేటి, జూపల్లి ఊగిసలాటలో పడ్డారు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్ను ఓడిరచాలంటే ఆ పార్టీ వ్యతిరేకులంతా ఓ గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం, లేదా అందరూ కలిసి ఒకే పార్టీలోకి వెళ్లడం తదితర ప్రత్యామ్నాయాలపై ఈ నాయకులంతా కలిసి నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు.
రాజకీయ పునరేకీకరణ జరగాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. అన్నారు. ఇందుకోసం తాము పునాదులు వేస్తున్నామని చెప్పారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు భేటీ అయ్యారు అనంతరం కాంగ్రెస్‌ నేతలు మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పతనానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా నేతలు పునాది వేస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ.. కేసీఆర్‌ అధికారానికి చివరి రోజు అవుతుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ కాలరాశారని విమర్శించారు. తెలంగాణలో బాగుపడిరదని కేసీఆర్‌ కుటుంబం మాత్రమేనని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి తప్ప మరెవరికి మేలు జరగలేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్‌ గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తామని’ రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్‌కు రేణుకా చౌదరి, మల్లు భట్టి విక్రమార్క కీలక భూమిక పోషిస్తున్నారని.. వారి అందరి సూచనలు, సలహాలతోనే తాము పొంగులేటిని, ఆయన మిత్రులను పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. పొంగులేటి నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. త్వరలోనే ఢల్లీి వెళ్లి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌తో చర్చించి.. వారి ఆశీస్సులతో త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. వ్యక్తులు ఎప్పుడూ వ్యవస్థ ముందుకు తలవంచక తప్పదని అన్నారు. ఖమ్మం జిల్లా ముఖ్య నేతలను కూడా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ముఖ్యం కాదు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
పార్టీకి అధికారం ముఖ్యం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. అధికారమే ముఖ్యమని అనుకుంటే.. సోనియా గాంధీ రెండు సార్లు ప్రధాన అయ్యేవారని అన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరిగిన.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ చేశారమని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారుమయం అయిందని విమర్శించారు. పొంగులేటిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌ రెడ్డి కూడా తమ చర్చల్లో పాల్గొన్నారని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు