- ఏంఆర్ఓ ఆఫీస్ ముందే తన్నులాట..
- అగ్రిమెంట్ చేసి రూ 6 కోట్లు తీసుకున్న
బాలగోని బాల్ రాజ్‌గౌడ్ అనే రియల్టర్.. - బౌన్సర్లతో ఐదుగురిపై దాడి చేయించిన వైనం..
- గాయాలతో పోలీస్ స్టేషన్ చేరిన ఇరు వర్గాలు..
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అగ్రిమెంట్ దారులు..
చేవెళ్లసి : చేవెళ్ల తాహసిల్దార్ కార్యాలయం ముందే ఓ బౌన్సర్ ఐదుగురి తలలు పగలగొట్టి వీరంగం సృష్టించాడు.. ఇది చూసిన స్థానికులు అడ్డగించి ఎమ్మార్వో కార్యాలయం లోని ఓగదిలో వేసి తలుపుకు తాళం వేశారు.. ఇరు వర్గాలు శాంతియుతంగా మాట్లాడుకుంటామని స్థానికంగా ఉన్న ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకుళ్లి బౌన్సర్ కు బడితపూజ చేసి ఇరు వర్గాలు పోలీస్‌స్టేషన్‌లో కూర్చున్నారు.
అసలు కథ ఇది :
అదే మండలానికి చెందిన ఖానాపూర్ రెవెన్యూలోని సర్వే నెం. 270లో 3 ఎకరాలకు.. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన బాలగోని బాల్‌రాజ్ గౌడ్ అనే వ్యాపారి, కవాడి తిరుపతి రెడ్డి వద్ద నుంచి రూ. 6 కోట్లు తీసుకుని అగ్రిమెంట్ చేశాడు. అయితే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి, అగ్రిమెంట్ చేసిన వ్యక్తులకు కాకుండా మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చిన బాల్‌రాజ్‌గౌడ్‌ను రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డగిస్తున్న సందర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ బౌన్సర్ రిజిస్ట్రేషన్ ఆపాడానికి వచ్చిన వ్యక్తులపై దాడిచేసి దాదాపుగా ఐదుగురి తలలు పగలగొట్టాడు.. ఇది చూసిన స్థానికులు మరింత గొడవ కాకుండా ఎమ్మార్వో ఆఫీసులోని ఓ గదిలో బౌన్సర్‌ను లాక్ చేసి పెట్టారు. గొడవ సద్దుమణిగాక పక్కనే ఉన్న ఓ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఇరు వర్గాలు ఒప్పందం కుదరక పోవడంతో.. అంతకుముందు దాడిచేసిన బౌన్సర్‌ను చితకబాది పోలీస్ స్టేషన్‌లో అప్పగించి వారిపై ఫిర్యాదు చేశారు…