- రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో 28 మందికి చోటు
- ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు
- ఐదుగురు అధికార ప్రతినిధులు, 8 మంది కార్యనిర్వాహాక కార్యదర్శులు
- పది మంది కార్యదర్శుల నియామకం చేపట్టిన కాసాని
- రాష్ట్ర పార్టీ చేనేత, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం
- మరో విడతలో అర్హులకు రాష్ట్ర కార్యవర్గ, అనుబంధ విభాగాల పదవులు
- తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరో 28 మందికి నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడు గా బడుగు దానయ్య (భువనగిరి), తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముంజా వెంకట రాజంను (స్టేషన్ ఘనపూర్) నియమించారు. ఈమేరకు బుధవారం వీరి నియామక ఉత్తర్వులను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జారీ చేశారు. తాజా నియామకాలతో కలిపి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుల సంఖ్య 61కి చేరింది. బుధవారం ప్రకటించిన జాబితాలో రాష్ట్ర కార్యవర్గంలో ఒకరిని ఉపాధ్యక్షులుగా, ముగ్గురిని ప్రధాన కార్యదర్శులుగా, ఐదుగురిని అధికార ప్రతినిధులుగా, ఎనిమిది మందిని కార్యనిర్వాహక కార్యదర్శులుగా, పదకొండు మందిని కార్యదర్శులుగా నియమించారు.
మరో విడతలో పూర్తి స్థాయి కమిటీ నియామకం.. : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
సీనియారిటీ, పనితీరు, ప్రాంతాలు, ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మహానాడు అనంతరం మరో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరిస్తామని, అర్హులైన నాయకులను పార్టీ అనుబంధ విభాగాల పదవులలో నియమిస్తామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు : పీ. చంద్రయ్య (పరిగి)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు : ఆజ్మీరా రాజు నాయక్ (భూపాలపల్లి), గడ్డి పద్మావతి (కంటోన్మెంట్ సికింద్రాబాద్), బండారి వెంకటేష్ (కార్వాన్).
రాష్ట్ర అధికార ప్రతినిధులు : బిల్డర్ ప్రవీణ్ (అంబర్‌పేట్), మ్యాడమ్ రామేశ్వర్ రావు (రాజేంద్రనగర్), డాక్టర్ ఏ ఎస్ రావు (గోషమహల్), ముప్పిడి గోపాల్ (కంటోన్మెంట్, సికింద్రాబాద్), సూర్యదేవర లత (జూబ్లిహిల్స్).
కార్యనిర్వాహాక కార్యదర్శులు : గాంధీ (ఎల్‌బి నగర్), సుజాత (ఖైరతాబాద్), ప్రకాష్ ముదిరాజ్ (ఎల్ బి నగర్), జి. జగదీష్ యాదవ్ (ఖైరతాబాద్), మండూరి సాంబశివరావు (సనత్‌నగర్), పుట్టి రాజు (మెదక్), బిక్షపతి ముదిరాజ్ (శేరిలింగంపల్లి), లీలా పద్మ (జూబ్లీహిల్స్)..
రాష్ట్ర కార్యదర్శులు : నిమ్మకాయల ఏడు కొండలు (రామగుండం), ఎండీ ఇమాం (మహబూబాబాద్), పీ. నందకిశోర్ (ఖైరతాబాద్), రాజేంద్రప్రసాద్ (సనత్‌నగర్), ఎం.రాజు (సనత్‌నగర్), జీలమోని రవీందర్ (ఇబ్రహీంపట్నం), రాపోలు నర్సింహులు (నకిరేకల్), బయ్య నారాయణ (కోదాడ), సుతారపు వెంకట నారాయణ (మహబూబాబాద్), ఎం.రాజు (శేరిలింగంపల్లి), తలారి శ్రీకాంత్ (ముషీరాబాద్).
చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు : బడుగు దానయ్య (భువనగిరి)
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు : ముంజా వెంకట రాజం (స్టేషన్ ఘనపూర్)