Friday, May 3, 2024

బలి దానాలతో తెలంగాణ

తప్పక చదవండి
  • ఆ తెలంగాణను బంగారం చేసుకోవాలి
  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
  • అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్‌

హైదరాబాద్‌ : బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆంధ్ర ప్రదేశ్‌ పై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే తొలిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నామని తెలిపారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు బీఫారమ్‌ అందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కష్టనష్టాల్లో చేదోడువాదోడుగా ఉంటామన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన 1200 మంది పైచిలుకు తెలంగాణ యువత, విద్యార్ధుల గౌరవార్ధం హోంరూల్‌ పాటించాలన్న ఆలోచనతోనే దశాబ్దంపాటు ఇక్కడ పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు.ఇక, 2104 మార్చి 14న తెలంగాణలోని హైదరాబాద్‌ వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. అంతకు ముందు 2008 నుంచి తెలంగాణ జిల్లాల్లో విరివిగా తిరిగి తెలంగాణ బాధలను, వారి ఆకాంక్షలను సమగ్రంగా అర్ధం చేసుకున్నాను అని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ ప్రజల బాధలు, కష్టాలకు నేను ఎప్పుడూ అండగా ఉండేవాడిని. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తే జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్దకాలం తర్వాత మొట్టమొదటిసారి 8 మంది అభ్యర్ధులతో జనసేన ఇక్కడ ఎన్నికల బరిలో దిగుతోంది. నాలుగు కోట్ల మంది సకల జనుల సమ్మె చేస్తే సాధించుకున్న తెలంగాణ ఇది. అందుకే దశాబ్దకాలం నేను ఇక్కడ పోటీ చేయలేదన్నారు.. సంపత్‌ నాయక్‌, మిరియాల రామకృష్ణ లాంటి యువత, విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి భవిష్యత్తు నాశనం చేసుకుంటే, అలాంటి యువత బలిదానాల మీద తెలంగాణ సిద్ధించింది. వారి గౌరవార్ధమే పోటీ చేయలేదు. దశాబ్దకాలం తర్వాత అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణుల నుంచి వచ్చి అభ్యర్ధన మేరకు, వారి ఆలోచనా విధానాన్ని మన్నించి 8 మంది అభ్యర్ధులతో తెలంగాణ బరిలో దిగుతున్నాం అని వెల్లడిరచారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇక్కడకు వలసలు వచ్చి తెలంగాణను నిర్వీర్యం చేయకూడదు.. ఆ ఉద్దేశంతోనే ఆంధ్రపై దృష్టి సారించాను అన్నారు పవన్‌ కల్యాణ్‌.. అక్కడ అభివృద్ధి ఉంటేనే ఇక్కడ వలసలు ఆగుతాయి. ఆంధ్ర నుంచి వలసలు ఆగకపోతే తెలంగాణ సాధన తాలూకా మూల కారణం నిష్ప్రయోజనం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజల కష్టనష్టాల్లో చేదోడుగా ఉండేందుకు ఇక్కడ దృష్టి సారిస్తూ పోటీ చేసే అభ్యర్ధులకు నా వంతు సహాయ, సహకారాలు అందిస్తాను అన్నారు.

ఇక, తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు నేమూరి శంకర్‌ గౌడ్‌ (తాండూరు), ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌ (కూకట్‌ పల్లి), మేకల సతీశ్‌ రెడ్డి (కోదాడ), వంగ లక్ష్మణ్‌ గౌడ్‌ (నాగర్‌ కర్నూలు), మిరియాల రామకృష్ణ (ఖమ్మం), డా. తేజావత్‌ సంపత్‌ నాయక్‌ (వైరా), లక్కినేని సురేందర్‌ రావు (కొత్త గూడెం), ఉమాదేవి (అశ్వారావుపేట)కు బీ ఫారమ్‌లు అందజేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు