Saturday, July 27, 2024

ఉస్సేన్ సాగర్ ఊసు మరిచిన రాష్ట్ర సర్కార్..

తప్పక చదవండి
  • సెయిలింగ్ వీక్ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళ సై..
  • పోటీల్లో మహిళలు పోటీపడటం ఎంతో గ్రేట్..
  • ఉస్సేన్ సాగర్ ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వం బాధ్యత..
  • వచ్చే ఏడాదికి ఈ పరిస్థితులు మారాలని ఆశిస్తున్నా : గవర్నర్..

హైదరాబాద్‌లో హుస్సెన్‌సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముంగిపు ఉత్సవాలకు గవర్నర్ తమిళసై హాజరయ్యారు. సెయిలింగ్ పోటీల్లో మహిళలు కూడా పోటీపడటం సాధరాణ విషయం కాదని ఆమె అన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని.. సెయిలింగ్ అనేది జీవిత పాఠాలను నేర్పుతుందని పేర్కొన్నారు. అలాగే హుస్సెన్‌సాగర్ చాలామంది ప్రతిభ గల సెయిలర్లను అందించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సెయిలింగ్ విభాగంలో భారత్‌కు పథకాలు వచ్చాయని తెలిపారు. రానున్న ఆసియా, ఒలంపిక్ క్రీడల్లో సెయిలింగ్‌లో మరిన్ని పథకాలు సాధించాలని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణకి చెందిన మాన్యరెడ్డి ఏషియన్ సెయిలింగ్‌లో పోటీపడటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే హుస్సేన్‌సాగర్‌పై కూడా తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్‌లో జాతీయ, అంతర్జాతీయ సెయిలర్లు సెయిలింగ్ చేస్తుంటారని.. కాబట్టి దిన్నీ శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రజలపై కూడా ఉందని సూచించారు. గతంలో హుస్సేన్‌సాగర్లో సెయిలింగ్ చేసేటప్పుడు చేలు, కప్పులు కనిపిస్తుండేవని.. కానీ ఇప్పుడు కాలుష్యం వల్ల అవి ఏమి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించి హుస్సెన్‌సాగర్‌ను శుభ్రపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని తెలిపారు. వచ్చే ఏడాదికి ఇలాంటి సమస్యలు ఉండకూడదని ఆశిస్తున్నానని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు