Saturday, May 18, 2024

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి

తప్పక చదవండి
  • తొలుత భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు
  • బాధ్యతలు అప్పగించిన బండి సంజయ్
  • బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే
  • మజ్లిస్ పార్టీపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
  • నా మీద లేనిపోనివి ప్రచారం చేశారు..
  • కిషన్ రెడ్డినైనా పనిచేసుకోనీయండి : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
  • కన్నీళ్లు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్

హైదరాబాద్ : తెలంగాణ బీజేప అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

రాష్ట్ర విభజన త్వరాత తెలంగాణలో మెదటసారి మాట్లాడుతూ… అధికార బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతులో ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కారు తాళాలు బీజేపీ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి తన వంతు కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొరకు బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పులు చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. బండి సంజయ్ ను బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. 2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలనే హైద్రాబాద్ లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

- Advertisement -

నా మీద లేనిపోనివి ప్రచారం చేశారు బండి సంజయ్
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పితూరీలు మోసారని మండిపడ్డారు. తన మీద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్కు ఫిర్యాదులు చేశారని బండి చెప్పుకొచ్చారు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలిని చురకలు అంటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయన్ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. శు క్రవారం నాడు కిషన్ రెడ్డి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించగా.. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న సంతృప్తి తనకుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సహరించిన కార్యకర్తలు, నేతలకు ఈ సభావేదికగా బండి ధన్యవాదాలు తెలిపారు. అంతటితో ఆగని సంజయ్.. ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్లను

పరోక్షంగా కామెంట్స్ చేశారు. పత్రికల్లో ఉండే వాళ్ళు ప్రజల్లో ఉండలేరని సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా, వార్తా పత్రికల్లో ఉండటం కాదు.. ప్రజల్లో ఉండాలని ఒకింత హితవు పలికారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పైసలు పంచలేదని.. ఆయన దగ్గర లేవన్నారు. అయితే.. కొందరు నేతలు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. బీజేపీలో బండి కామెం ట్స్ చర్చనీయాంశంగా మారాయి. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రకాశ్ జవాడేకర్, మురళీధర్ రావు, తరుణ్ చుగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక, ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. బండి ప్రసంగం విన్న ఈ నేతలు నోరెళ్లబెట్టారు. వాస్తవానికి.. ఈ మధ్య ఈటల-బండి వర్గానికి అస్సలు పడట్లేదు. ఇరు వర్గీయులు పార్టీ ఆఫీసులోనే కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న ఈటల ఈ సభావేదికగా గట్టిగానే చురకలు అంటించారని బండి వర్గీయులు చెప్పుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గురించి ఈ మధ్యే హైదరాబాద్, ఢిల్లీ వేదికగా ఎమ్మెల్యే రఘునందన రావు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపి రెండు ఒక్కటి కాదని చెప్పేందుకు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాజగోపాల్ తీవ్ర వాఖ్యలు చేశారు.

భావోద్యేగానికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ను చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. కిషన్రెడ్డి సభలో బండి సంజయ్ జపం చేశారని, బండి సంజయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ కారణంగానే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచింది బండి సంజయ్ నాయకత్వంలోనే అని కొనియాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో సమిష్టిగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు పేరు చెప్పుకుని బతుకుతున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారూ మీరు చెప్పేది అక్షర సత్యం.. నిజం నిప్పు లాంటిది… కానీ పెద్ద పెద్ద ద్రోహులు ఆడే ద్రోహపు చదరంగంలో.. నిజాయితీపరులు ఎప్పటికైనా సమిధలు కాక తప్పదు… ముఖ్యంగా హిందీ కోసం పోరాటం చేసి కార్యకర్తలు.. అంటూ రాజగోపాల్ రెడ్డి అభిమానులు తమ అభిప్రాయాలను సోషియల్ మీడియా ద్వారా పంచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు