Friday, May 17, 2024

డీజిల్‌ కార్లపై టాటా మోటార్స్‌ కీలక ప్రకటన..

తప్పక చదవండి

రాబోయే రోజుల్లో డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, దీని వల్ల కాలుష్యాన్ని నివారించేందుకు దోహదపడుతుందని గడ్కరీ అన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, లేకపోతే డీజిల్‌ వాహనాలపై 10 శాతం జీఎస్టీ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటనపై టాటా ఎండీ శైలేష్‌ చంద్ర స్పందించారు. తాము ఈ వాహనాలు మార్కెట్లో డిమాండ్‌ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2040 సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో..

టాటామోటార్స్ లిమిటెడ్ తన ప్రస్తుత మోడళ్లైన ఆల్టోజ్, హారియర్, సఫారీ, ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ వంటి డీజిల్ ఆధారిత వేరియంట్‌లను మార్కెట్ డైనమిక్స్, రెగ్యులేషన్స్ అనుమతి ఉన్నంత వరకు ఉత్పత్తిని కొనసాగిస్తామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అన్నారు. గత రెండు రోజుల కిందట కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి ప్రకటనపై ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, దీని వల్ల కాలుష్యాన్ని నివారించేందుకు దోహదపడుతుందని గడ్కరీ అన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, లేకపోతే డీజిల్‌ వాహనాలపై 10 శాతం జీఎస్టీ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటనపై టాటా ఎండీ శైలేష్‌ చంద్ర స్పందించారు. తాము ఈ వాహనాలు మార్కెట్లో డిమాండ్‌ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2040 సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని నిలిపివేసే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

- Advertisement -

ఇక మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేస్తామని అన్నారు. అదే సమయంలో వేలాది మంది ప్రజలు డీజిల్ ఇంజిన్ మోడల్‌లను కోరుకుంటారని, అందుకే (ఒరిజినల్‌ ఇక్యూమెంట్‌ మ్యానిఫ్యాక్షర్‌) అసలైన పరికరాల తయారీదారుగా మా విధానం కొనసాగించేందుకు సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్నంత వరకు డీజిల్ వాహనాల తయారీని కొనసాగిస్తాము అని టాటా ఎండీ స్పష్టం చేశారు.

అయితే గత కొన్ని రోజులుగా టాటా డీజిల్‌ వాహనాలపై 10 శాతం అదనపు ట్యాక్స్‌ విధించనున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డీజిల్‌ కార్లపై ట్యాక్స్‌ విధించే అంశం ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని, దీనినై తాను క్లారిటీ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. అయితే ఈ క్లారిటీ ఇచ్చిన అరగంటలోనే మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాలుష్యం వెదజల్లే డీజిల్‌ కార్లను నిలిపి వేయాలని కోరుతున్నానని, కాలుష్యాన్ని నివారించేందుకు వాహనాల కంపెనీలు డీజిల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని, లేకుంటే అన్ని రకాల డీజిల్‌ వాహనాలపై 10 శాతం అదనపు పన్ను విధించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను అభ్యర్థిస్తానని అన్నారు. తర్వాత అదనపు ట్యాక్స్‌ పెంచినట్లయితే కంపెనీలు తీవ్ర భారం మోయాల్సి వస్తుందని, అందుకే కాలుష్యం వెదజల్లే అన్ని డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని కోరారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. డీజిల్‌ వాహనాలపై అదనపు ట్యాక్స్‌ విధించే అంశం కేంద్రం పరిశీలనలో లేదని చెబూతూనే కాలుష్యం నివాష్యం నివారించాలంటూ డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, లేకుంటే 10 శాతం ట్యాక్స్‌ భారం మోయాల్సి వస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనపై టాటా ఎండీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కంపెనీ గతంలో అనేక డీజిల్‌తో నడిచే ప్యాసింజర్ వాహనాలను దశలవారీగా నిలిపివేసిందని, ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం ఉనికిలో ఉన్న నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని టాటా ఎండీ శైలేష్‌ చంద్ర చెప్పారు. నియంత్రణ అవసరాలు చాలా కఠినంగా మారినప్పుడు నిర్దిష్ట పవర్‌ట్రెయిన్ ఉనికిలో లేనప్పుడు, మేము దానిని అనుసరిస్తాము. ఇప్పుడు మా వద్ద కేవలం కొన్ని విభాగాలలో మాత్రమే డీజిల్ మోడల్‌లు ఉన్నాయి. దశల వారీగానే డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తామని అన్నారు.

గ్రీన్ మొబిలిటీకి దోహదపడేందుకు ఇతర కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలలోకి ప్రవేశించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కంపెనీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. టాటా మోటార్స్ లాగానే, మరో స్వదేశీ వాహన తయారీ సంస్థ, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా డీజిల్‌ వాహనాల ఉత్పత్తికి దూరం ఉండబోదని స్పష్టం చేశారు. జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ కూడా డీజిల్ ఇంజిన్‌లను తమ పోర్ట్‌ఫోలియో నుంచి తొలగించబోమని పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు