Saturday, July 27, 2024

తెల్లోడి గుండెల్లో దడ పుట్టించిన సుభాష్‌ చంద్రబోస్‌

తప్పక చదవండి

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ భారత స్వతంత్ర సంగ్రామంలో ఓ ప్రత్యేక అధ్యాయం. ఫౌజ్‌ అనగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. తెల్లోడి గుండెల్లో దడ పుట్టించిన బోస్‌, ఫౌజ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే.నేతాజీ భారత జాతీయ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖుడు.సుభాష్‌ చంద్రబోస్‌ జననం 1897, జనవరి 23,మరణం1945,18ఆగస్టు. గివ్‌ మి యువర్‌ బ్లడ్‌ అండ్‌ ఐ విల్‌ గివ్‌ యు ఫ్రీడమ్‌.. యుద్ధంతోనే స్వాతంత్య్రం సాధ్యం అన్న ఉద్దేశంతో ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’ని నెలకొల్ప డమే కాదు, తన సైన్యాన్ని పోరాటానికి సన్నద్ధం చేసేందుకు ఉద్వేగంతో ఉపన్యసించిన సందర్భంగా సుభాష్‌ చంద్ర బోస్‌ పై విధంగా అన్నారు. ఇది వినగానే ప్రతి ఒక్క సైనికుడి రోమాలూ నిక్కబొడుచుకునేవి. పౌరుషం తన్నుకొచ్చేది. ఈ ఒక్కటే కాదు, ‘స్వాతంత్య్రం ఎవరో ఇచ్చేది కాదు.ఎవరికి వాళ్లు తీసుకునేది. ఇలా ఆయన మాటలన్నీ ఎక్కుపెట్టిన బాణాల్లా జనంలోకి దూసుకెళ్లి సమర భేరి మోగించేవి.ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులం దరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరా టం సాగిస్తే బోస్‌ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయు లను దేశం నుంచి తరిమి కొట్టవచ్చు నని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలి పోయింది. పోరుబాటలో నేతాజీ.. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌ కు అధ్యక్షు డిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాల తోనే ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపా ను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారా లతో ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పరచాడు. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. జై హింద్‌.. ఇది విన గానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది సుభాష్‌ చంద్రబోస్‌. జర్మనీలో ఇంజినీరింగ్‌ చదువుకుని నేతాజీ ఐఎన్‌ఏలో మేజర్‌గా పని చేసిన జెయిన్‌ అల్‌ అబిద్‌ హసన్‌ చేసిన వందన నినాదమిది. తన సైన్యానికి భారతీ య తరహాలో వందనం కావాలని బోస్‌ అడిగిన ప్పుడు- జై హిం ద్‌ అని హసన్‌ సూచించారట. అలా నేతాజీ సైన్యం ఈ సెల్యూట్‌ చేసేదట. స్వాతంత్య్రానంతరం ఇది జాతీయ వందనంగా మారి, రాజకీయ నాయకులూ ప్రధాన మంత్రులూ ఉపన్యాసం ముగింపులో జై హింద్‌ అని పలికే సంప్రదాయం వచ్చింది. అతని మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించా డని ప్రకటించినప్పటికి, అతను ప్రమా దం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధం-నేతాజీ కుమార్తె అనితాబోస్‌.. డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధమని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌ తెలిపారు. జపాన్‌ రాజధాని టోక్యో రెంకోజీ టెంపుల్‌లో ఉన్న నేతాజీ అస్థి కలను భారత్‌కు తీసుకురావాలని ఆమె కోరుతున్నారు. రెంకోజీ టెంపుల్‌లో ఉన్న అస్థికలు నేతాజీవేనా? కాదా? అనే విషయంలో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలనుకుంటే తాను అందుకు సిద్ధమని అనిత ప్రకటించారు. నేతాజీ అస్థికలు ఉండా ల్సింది భారత్‌లోనే అని ఆమె చెబుతున్నారు. నేతాజీ జీవితాన్నం తటినీ భారత స్వాతం త్య్రం కోసమే అర్పించారని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్ప టికైనా ఆయన అస్థికలను భారత్‌కు తీసు కువచ్చేం దుకు గట్టిగా ప్రయత్నించాలని కూడా ఆమె పిలుపు నిచ్చారు. భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో చిరస్మరణీయమైన సేవలం దించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు నడుంబిగించాలి. ఇదే మనం నేతాజీకి ఇచ్చే ఘన నివాళి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు