Saturday, December 2, 2023

దూసుకెళ్తున్న తెలంగాణ సెయిలర్లు

తప్పక చదవండి
  • మైసూరు నేషనల్స్‌లో 12 పతకాలు సొంతం, మొదటి స్థానంలో తెలంగాణ
  • 6 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు
  • కేవలం 9ఏళ్ళ వయసులోనే గౌతమ్‌ యాదవ్‌కు అతి పిన్న వయస్కుడైన బాల పతకం
  • ఈధరణి, తనూజ అండ్‌ క్రూస్‌ మిక్స్‌ డ్‌, ఓపెన్‌ వారికి
    రెండు స్వర్ణాలు, రెండు రజతాలు దక్కాయి.

    హైదరాబాద్‌ : తెలంగాణ సెయిలర్లు తమ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. కర్ణాటకలోని కృష్ణరాజ సాగర్‌ ఆనకట్ట వద్ద నిర్వహించిన మైసూరు నేషనల్స్‌లో వీరు మొత్తం 12 పతకాలు సాధించారు. జూనియర్‌ నేషనల్‌ ర్యాంకింగ్‌ రెగెట్టాలో ఏ రాష్ట్రం ఇంతవరకు ఇన్ని పతకాలు సాధించలేదు. దీక్షిత కొమరవెల్లి.. 39 మంది ఆడ, మగ సెయిలర్లలో మూడో స్థానంలో నిలిచింది. కొన్ని ఘోర తప్పిదాలు చేసి ఉండకపోతే ఆమె రెండోస్థానంలో నిలిచేది. ఆమె ఇప్పుడు నేషనల్‌ గర్ల్స్‌ ఛాంపియన్‌, అండర్‌-15 ఆప్టిమిస్ట్‌ క్లాస్‌లో బాలికల విభాగంలో ఇండియా నెం.1. ఇంతకు ముందు తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన ముగ్గురు అమ్మాయిలలో ప్రీతి కొంగర, రaాన్సీ లావేటి, రవళి పరాండి ఉన్నారు. 45 పాయింట్ల భారీ తేడాతో దీక్షిత బాలికల గోల్డ్‌ మెడల్‌ సాధించగా, భోపాల్‌ కు చెందిన రెండో అమ్మాయి సమృద్ధి బాథమ్‌ 10వ స్థానంలో నిలిచింది. దీక్షిత సోదరి లాహిరి కొమరవెల్లి సైతం కాంస్య పతకం సాధించింది. వీరిద్దరూ ఉద్భవ్‌ పాఠశాలలో చదువుతున్నారు. వీరిద్దరూ జాతీయ ర్యాంకింగ్‌లో మెరుగైన స్థానంలో ఉన్నారు. అక్టోబర్‌లో ముంబాయిలో జూనియర్‌ నేషనల్‌ జరుగుతుండటంతో ఇద్దరూ 1, 2 ర్యాంకుల కోసం పోటీపడుతున్నారు. 420 మిక్స్‌ డ్‌ అండ్‌ ఓపెన్‌ క్లాసుల్లో మాన్‌ సూన్‌ రెగెట్టా ఛాంపియన్స్‌ కెప్టెన్‌ ధరణి లావేటి, సిబ్బంది మల్లేష్‌ వడ్ల 11 రేసుల్లో వరుసగా 9 రేసుల్లో విజయం సాధించారు. దీంతో దేశంలో అంతర్జాతీయ 420 క్లాస్‌ ను ఎవరు శాసిస్తున్నారనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. తోటి తెలంగాణ సెయిలర్లు తనూజ కామేశ్వర్‌, శ్రవణ్‌ లు కేవలం ఒక విజయంతో వరుసగా రెండో స్థానాలు సాధించి రజత పతకం సాధించారు. వీరిద్దరూ ఓపెన్‌ క్లాస్‌ లో స్వర్ణం, రజతం కూడా గెలుచుకున్నారు. తెలంగాణకు చెందిన బన్ని బొంగూర్‌, డేనియల్‌ రాజ్‌ కుమార్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ కూడా మైసూర్‌ నేషనల్స్‌ లో తమ ర్యాంకులలో పురోగతి సాధించారు. వీరు రాబోయే జూనియర్‌ నేషనల్స్‌ లో తెలంగాణకు పైచేయి సాధించి, క్రీడా మంత్రిత్వశాఖ ఆర్థికసాయంతో ఇంటర్నేషనల్స్‌ లో గొప్ప అవకాశం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సెయిలింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దాదీ భోటే మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో ప్రాక్టీస్‌ చేయడానికి ఒక చిన్న సరస్సు మాత్రమే ఉంది. మిగిలిన దంతా భూభాగమే. అయినా ఇప్పటివరకు 150కి పైగా పతకాలు సాధించింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ 420 క్లాస్‌, ఆప్టిమిస్టిక్‌ క్లాస్‌లలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది’’ అన్నారు. ఆసియా క్రీడలకు ఫెడరేషన్‌ ఎంపిక చేసిన ప్రీతి కొంగర అనే అమ్మాయితో సెయిలింగ్‌లో గొప్ప పురోగతి సాధిస్తున్నాం. జాతీయ జట్టులో స్థానం పొందేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు’’ అని హైదరాబాద్‌కు చెందిన వైసీహెచ్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, చీఫ్‌ కోచ్‌ సుహైమ్‌ షేక్‌ తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు