Friday, May 17, 2024

అత్యుత్తమ కోచింగ్ హబ్‌ రాజస్థాన్ కోటలో విద్యార్థుల ఆత్మహత్య..

తప్పక చదవండి

దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్ లోని కోటలో తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్, వైద్య విద్యను అభ్యసించడానికి జరిపే నీట్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ అధికారులు కావాలని ఆకాంక్షించే వారి కోసం కోటలో పలు కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి..
కానీ నీట్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుంటున్న అవిష్కార్ శుభాంగి, బీహార్ విద్యార్థి ఆదర్శ్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది రాజస్థాన్ కోటలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరుకున్నది. 2018 తర్వాత ఇది అత్యధికం. పరిస్థితులు ఆందోళన కరంగా మారడంతో నెల రోజులుగా కోటలోని కోచింగ్ కేంద్రాల్లో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన అవిష్కార్ శుభాంగి.. కోటలో ఉన్న తన బామ్మ తాతయ్యల వద్ద ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆదివారం టెస్ట్ తర్వాత ఆరో అంతస్తు నుంచి దూకాడు. పోలీసులు చికిత్స కోసం అతడ్ని దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించాడని చెప్పారు. ఆదివారం సాయంత్రం కున్నదిలో ఆదర్శ్.. ఉరేసుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. కొవిడ్ తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం 60 శాతానికి పెరిగిందని, ఇది ఆందోళనకరం అని స్థానిక డీఎస్పీ ధరంవీర్ సింగ్ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు