Monday, September 25, 2023

తెలంగాణకు మరో పోరాటం అందించాల్సిన అవసరం ఉంది ..

తప్పక చదవండి

తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు అవుతున్నా సంపూర్ణ తెలంగాణ రాలేదని.. నాటి దొరల తెలంగాణ మళ్లీ కొనసాగుతుందని హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ, ప్రజాయుద్ధ నౌక గద్దర్, ప్రో. కోదండరాంలు అభిప్రాయపడ్డారు. అలై బలై ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారు ప్రసంగించారు. తెలంగాణ అంటేనే పోరాటమని, ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించం అని 10 ఏళ్ల దొరల తెలంగాణలో అన్నీ అవమానాలే అని అమరవీరుల సాక్షిగా క్షమాపణలు చెబుతున్నామని గద్దర్ అన్నారు.. అమరవీరుల తల్లులు నేడు భిక్షాటన చేస్తున్నారని.. వారి కుటుంబాలు వీధిన పడ్డాయని.. మనం తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, సింగరేణిలో లక్ష ఉద్యోగాలు నేడు 60 వేలకు చేరుకున్నాయని, తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులు నేడు రోడ్డున పడ్డారన్నారు. ఎవరికోసం ఉద్యమం చేసినమని.. నేడు గోడు వెల్లబోసుకునే స్థితికి తీసుకువచ్చాయని.. బిజెపి గట్టిగా పోరాటం చేస్తే అధికారం తప్పక వస్తుందని గద్దర్ అన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని కేసీఆర్ అహంకార పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించినప్పుడే అమరుల ఆత్మ శాంతిస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీలు కలిసి పనిచేసే అని.. నేడు పనిచేసిన వారిని పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టిన హీన చరిత్ర కేసీఆర్ కి దక్కుతుందని ప్రో కోదండ రామ్ అన్నారు. తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం ఉంటుందని కలలో కూడా ఊహించలేదని, తెలంగాణ తెచ్చుకున్నది పాపమైందన్నారు ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య.. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని దుఃఖం వస్తుందని.. తెలంగాణలో 1200 మంది తల్లుల కడుపుకోత ఒక్కో కుటుంబాన్ని చూస్తే కలిచి వేస్తుందని, వారికీ పదేళ్లలో న్యాయం జరిగిందా..? అని ప్రశ్నించారు. ఉద్యమంలో లాఠీలకు, తూటాలకు ఎదురెళ్లి తమ ఉద్యోగాలను ప్రాణంగా పెట్టి పనిచేసిన జర్నలిస్టులకు ఏం న్యాయం చేశారని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ప్రశ్నించారు. తెలంగాణ వస్తే సుఖసంతోషాలతో జర్నలిస్టులు ఉంటారనుకున్నాం కానీ రెట్టింపు బాధలు కేసీఆర్ పాలనలో ఉన్నాయని.. ఈ పాలన ప్రజలకు దూరమైనప్పుడే ప్రజలకు జర్నలిస్టులకు కేసీఆర్ పీడా విరగడైతుందని.. అందుకోసం అందరూ కలిసికట్టుగా కేసీఆర్ ను డీ కొట్టాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక తాటిపై పనిచేసిన అన్ని జేఏసీల నాయకులు మళ్లీ ఒకచోటికి చేరడం పదేళ్ల తెలంగాణలో ప్రజలకు జరిగిన అన్యాయాలపై మాట్లాడడం జరిగింది.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకులకు అలై బలై ఫౌండేషన్ ద్వారా బండారు విజయలక్ష్మి సన్మానం చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బందర్ దత్తాత్రేయ పాల్గొని పలువురుని సన్మానించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జేఏసీ చైర్మన్ ప్రో కోదండరాం, ప్రజాయుద్ధ నౌక గద్దర్ , మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గాదే ఇన్నయ్య, ఏబీవీపీ పూర్వ జాతీయ అద్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యేందెల శ్రీనివాస్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, ధూమ్ దాం వ్యవస్థాపకులు అంత దుపుల నాగరాజులకు.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారందరికీ సన్మానం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు