వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాల వారితో పాటు వివిధ వృత్తుల వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి మద్దతుగా నిలుస్తున్నారు. స్వయంగా ఆయనను కలిసి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మంత్రి ఎర్రబెల్లిని వివిధ సామాజిక వర్గాల వారు, కులవృత్తుల వారు వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో ప్రత్యేకంగా కలిసి తమ మద్దతు తెలిపారు. నియోజకవర్గంలోని తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు దయాకర్‌రావుకు మద్దతుగా నిలిచారు. మంత్రిని కలిసి తమ మద్దతు ప్రకటించారు. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన రజక సంఘం, పాలకుర్తి ఎలక్ట్రికల్ యూనియన్, రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన రెడ్డి సంఘం మంత్రి ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచింది. ఆ సంఘం బాధ్యులు మంత్రి దయాకర్ రావుని పర్వతగిరిలో కలిసి తమ మద్దతు ప్రకటించారు.